NTV Telugu Site icon

Viral: రీల్ కోసం వీడియోకు ఫోజులిచ్చిన మహిళ.. చైన్ లాక్కెళ్లిన దొంగ

Viral

Viral

ఈ మధ్య సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు పాటలు, డ్యాన్స్, డైలాగ్స్ తో రీల్స్ చేస్తుంటారు. అలా చేస్తుండగా అనేక సందర్భల్లో పలు ప్రమాదాలు జరుగుతున్నాయి. కానీ, ఈ రీల్స్ చేసే పిచ్చి ముదిరిపోవడంతో అలాంటి ఏమీ పట్టనట్లు రీల్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. చిత్ర విచిత్రమైన వీడియోలు చేస్తూ.. ఆ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ లు చేసి లైక్స్, కామెంట్స్, షేర్ అంటారు. కానీ, తాజాగా, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ లో రీల్ కోసం ఓ మహిళ వీడియోకు ఫోజులిస్తున్న సమయంలో ఓ దొంగ బైక్ పై వచ్చి ఆమె మెడలోని బంగారు గొలుసును దోచుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Read Also: BJP MP Candidates: వరంగల్, ఖమ్మం ఎంపీ అభ్యర్థులు.. ప్రకటించిన బీజేపీ

అయితే, ఘజియాబాద్ నగరంలోని ఇంద్రపురానికి చెందిన సుష్మ ఇన్ స్టాగ్రామ్ రీల్ షూటింగ్ కోసం నవ్వుతూ రోడ్డు మీద నడుచుకుంటూ ముందుకు వస్తుంది. కరెక్ట్ అదే సమయంలో బైక్ పై హెల్మెట్ పెట్టుకున్న ఓ వ్యక్తి సుష్మ మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లాడు. ఈ విషయంపై బాధితురాలు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. చైన్ ను లాక్కెళ్లిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక, సోషల్ మీడియాలో వైరల్ గా మారిన చైన్ స్నాచింగ్ కేసుకు సంబంధించి కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నామని ఇంద్రపురం ఏసీపీ స్వతంత్ర కుమార్ పేర్కొన్నారు.

Show comments