NTV Telugu Site icon

Uttar Pradesh : నీటిని మళ్లించే విషయంలో గొడవ.. కాల్పుల్లో తండ్రీ కొడుకులు మృతి

New Project 2024 06 22t122429.665

New Project 2024 06 22t122429.665

Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని మామిడితోటలో నీటిపారుదల వివాదంలో కాల్పులు జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ నివారి ప్రాంతంలో మామిడి తోటకు కాపలాగా ఉన్న ముగ్గురు వ్యక్తులపై దుండగులు కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మూడో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో తండ్రీకొడుకులు ఉన్నారు. దాడికి గురైన ముగ్గురూ ముస్లిం వర్గానికి చెందిన వారే. ఈ ఘటన నివారి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖిందౌరా గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు నిరసనగా మృతుని బంధువులు గంగానహర్‌ ట్రాక్‌ను దిగ్బంధించారు. రెండు వర్గాలకు సంబంధించిన ఘటన కావడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక్కడ భారీగా పోలీసు బలగాలను మోహరించారు. సంఘటనా స్థలానికి ఏడీసీపీ దినేష్ కుమార్ చేరుకున్నారు. గొడవలు సృష్టించవద్దని ప్రజలకు ఆయన సూచించారు.

Read Also:NTR 31 : ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ ఏకంగా అన్ని దేశాలలో జరగనుందా..?

మీరట్‌లోని జానీ పోలీస్ స్టేషన్‌లో ఉన్న ధౌలాడి నివాసి పప్పు కుటుంబం కాంట్రాక్ట్‌పై మామిడి తోటను తీసుకుందని పోలీసులు తెలిపారు. నివారిలోని ఖిందౌడా గ్రామంలో కాంట్రాక్ట్‌పై మామిడి తోటలు తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో పప్పు తన కుమారులు రాజా, చాంద్‌తో కలిసి ఓ తోట నుంచి మరో తోటకు వెళ్తున్నారు. అప్పుడు గుర్తు తెలియని దుండగులు అతడిని బుల్లెట్లతో కాల్చి కాలువలోకి విసిరారు. ఈ దాడిలో పప్పు, రాజా అక్కడికక్కడే మృతి చెందారు. చంద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పప్పు, రాజా మృతదేహాలను కాల్వ నుంచి స్వాధీనం చేసుకున్నారు. డైవర్ల సాయంతో పప్పు మృతదేహాన్ని వెలికితీశారు. కాగా, తీవ్రంగా గాయపడిన చంద్ ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు సమాచారం.

Read Also:Education Minister: నీట్ పరీక్షను ఎందుకు రద్దు చేయలేదంటే..?

ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులు మాట్లాడుతూ.. ‘శుక్రవారం రాత్రి మామిడితోటలో సాగునీటి విషయంలో గ్రామస్తుల మధ్య వాగ్వాదం జరిగింది. అంతకుముందు విషయం సద్దుమణిగింది. ఆ తర్వాత ఈ ఘటన అర్థరాత్రి జరిగింది. దుండగులు 15 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ సంఘటన వార్త ప్రజలలో ఆగ్రహాన్ని సృష్టించింది. శనివారం ఉదయం ధౌలాడి గ్రామం నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడి నివారి వద్దకు చేరుకుని హల్ చల్ చేశారు. ఆగ్రహించిన గుంపు గంగానహర్ ట్రాక్‌ను అడ్డుకుంది. ఏడీసీపీ దినేష్‌కుమార్‌తో సహా పోలీసు అధికారులందరూ ప్రజలను శాంతింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారు.