Site icon NTV Telugu

Sony Bravia Price: అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్‌.. సగం ధరకే ‘సోనీ బ్రేవియా’ 55 ఇంచెస్‌ టీవీ!

Bravia 55 Inches Tv

Bravia 55 Inches Tv

దీపావళి పండుగ సీజన్‌లో ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లు సేల్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ‘బిగ్‌ దీపావళి’ సేల్‌ను ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించగా.. ‘గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌’ సేల్‌ను అమెజాన్‌ తీసుకొచ్చింది. ఈ సేల్స్‌లో స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులపై భారీ ఎత్తున ఆఫర్లు ఉన్నాయి. సేల్‌లో భాగంగా సోనీ కంపెనీకి చెందిన స్మార్ట్‌ టీవీపై అమెజాన్‌ కళ్లు చెదిరే ఆఫర్‌ అందిస్తోంది. ఆ డీటెయిల్స్ ఓసారి చూద్దాం.

సోనీ బ్రేవియా 55 ఇంచెస్‌ 4కే అల్ట్రా హెచ్‌డీ ఎల్‌ఈడీ గూగుల్ టీవీ అసలు ధర రూ.99,900గా ఉంది. అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌లో 45 శాతం డిస్కౌంట్‌ ఉంది. దీంతో ఈ టీవీని రూ.54,990కు సొంతం చేసుకోవచ్చు. ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1500 వరకు డిస్కౌంట్‌ లభించనుంది. అలాగే ప్రత్యేక కూపన్‌ ద్వారా మరో రూ.1500 డిస్కౌంట్‌ను పొందవచ్చు. మొత్తంగా రూ.3 వేలకు పైగా డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో ఈ సోనీ బ్రేవియా టీవీని రూ.49 వేలకు సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Also Read: R Ashwin Record: చరిత్ర సృష్టించిన రవిచంద్రన్ అశ్విన్‌.. ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా రికార్డు!

ఈ సోనీ బ్రేవియాలో 55 ఇంచెస్‌ ఎల్‌ఈడీ స్క్రీన్‌ను ఇచ్చారు. 4కే ప్రాసెసర్‌, 4కే హెచ్‌డీఆర్‌ స్క్రీన్‌ దీని సొంతం. 60 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌ ఉంటుంది. 178 డిగ్రీల వ్యూయింగ్‌ యాంగిల్‌ను ఇందులో ఇచ్చారు. 20 వాట్స్‌ అవుట్‌పుట్‌కు సపోర్ట్‌ చేసే డాల్బీ ఆడియోను అందించారు. వైఫై, యూఎస్‌బీ, ఈథర్‌నెట్‌, హెచ్‌డీఎమ్‌ఐ వంటి కనెక్టివిటీ ఫీచర్స్ ఉన్నాయి. ఓకే గూగుల్‌, గూగుల్‌ ప్లే, క్రోమ్‌ కాస్ట్‌ వంటి ఫీచర్లకు ఈ టీవీ సపోర్ట్‌ చేస్తుంది. ఈ టీవీపై 2 ఏళ్ల వారంటీ ఉంది.

Exit mobile version