NTV Telugu Site icon

Paruvu: దొరికిపోవాలి లేదా పారిపోవాలి.. క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా రాబోతున్న ‘పరువు’.. ట్రైల‌ర్ రిలీజ్..

Paruvu

Paruvu

టాలీవుడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ పోలీసులతో జరిగిన గొడవ సంబంధించిన ఓ వీడియో కొన్ని రోజుల క్రితం వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇందులోని అసలైన రహస్యం తెలిసింది. ఇదంతా తన కొత్త సినిమాకు పబ్లిసిటీ స్టంట్ అనే సంగతి తెలిసిందే. నివేదా పేతురాజ్ తాజా వెబ్ సిరీస్ ‘పరువు’. ఈ సినిమా ప్రమోషన్‌లో నివేదా ఇలా ప్రవర్తించిందని మేకర్స్ స్పష్టం చేశారు. మూవీ మేకర్స్ ఇప్పటికే ప్రీమియర్ తేదీ, ఫస్ట్ లుక్‌ ను ప్రకటించారు. ఇక తాజాగా వెబ్ సిరీస్ ట్రైలర్‌ ను కూడా విడుదల చేశారు.

PREMINCHODDU: ప్రతి విద్యార్థి తప్పనిసరి చూడాల్సిన చిత్రం ‘ప్రేమించొద్దు’.. ట్రైలర్ విడుదల..

ఇక తాజాగా విడుదలైన ‘పరువు’ ట్రైలర్ చూస్తే… నివేదా పేతురాజ్, నరేష్ అగస్త్య ప్రేమికులుగా ఇందులో కనపడతారు. కులమతాల వల్ల ఇంట్లో ఒప్పుకోకపోవడంతో వారు అదంతా తెలియక పారిపోతుంటారు. ఈ ఎపిసోడ్‌లో వారికి ఏం జరిగింది అనేది సినిమా కథాంశం. ఈ క్రైమ్ సిరీస్‌ లో నాగబాబు ఓ కీలక పాత్ర పోషిస్తుండగా, గోల్డెన్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సుస్మిత కొణిదెల ఈ సిరీస్ ను నిర్మిస్తున్నారు. సిద్ధార్థ్‌, రాజశేఖర్‌లు ఈ సిరీస్‌కి సహ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ జూన్ 14 నుండి ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫారమ్ జి5 లో ప్రసారం చేయబడుతుంది.

Show comments