Site icon NTV Telugu

No Work Full Salary: మరీ ఇంత దారుణమా.. 16 ఏళ్లుగా ఆఫీసుకి రాకుండా.. పూర్తి జీతం!

German Teacher

German Teacher

No Work Full Salary: ఈరోజుల్లో ఒక్కరోజు సెలవు పెడితేనే జీతం కట్ అవుతుందని తెగ పరేషాన్ అవుతుంటాం. కానీ ఒకరు ఏకంగా 16 ఏళ్లుగా ఆఫీస్ గడప తొక్కకుండా ప్రతీ నెల పూర్తి జీతం తీసుకుంటూ ఏకంగా రూ.11 కోట్లు సంపాదించారు. ఇలాంటివి చూస్తుంటే ప్రభుత్వ సంస్థలు మరీ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయా.. అనే అనుమానం వస్తుంది. కానీ ఇది నిజం. ఎందుకంటే 16 ఏళ్లుగా ఒకరు పని చేయకుండా సెలవుల్లో ఉంటూ ప్రతీ నెల క్రమం తప్పకుండా జీతం తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది.. అసలు ఏంటీ కథ అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

READ ALSO: Nepal: నేపాల్ అల్లర్లలో భారతీయ మహిళ మృతి, 51కి చేరిన మృతుల సంఖ్య..

ఆమె ఒక అధ్యాపకురాలు. 16 ఏళ్లుగా అనారోగ్య సెలవులోనే ఉన్నారు. కానీ ఇక్కడ విశేషం ఏమిటంటే ఆమెకు ప్రతీ నెలా పూర్తి జీతం వస్తుంది. ఇది ఏంది బాస్ అంటే ఇది అంతే. మీకు తెలుసా ఇప్పటి వరకు ఆమె 16 ఏళ్లుగా సెలవుల్లో ఉంటూ ఏకంగా రూ.11 కోట్ల పైగా సంపాదించింది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆమె 16 ఏళ్లుగా అనారోగ్య సెలవులో ఉన్నప్పటికీ, ఇప్పటికీ ఆమెను తన ఉద్యోగంలో నుంచి తీసేయలేదు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ వెలుగుచూసిందని అనుకుంటున్నారా.. జర్మనీలో. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

జర్మనీలోని నార్త్ రైన్ వెస్ట్‌ఫాలియాలోని ఒక వృత్తి కళాశాలలో ఆమె అధ్యాయురాలుగా. మీకు తెలుసా ఆమె 2009 నుంచి అనారోగ్య సెలవులోనే ఉన్నారు. కానీ ప్రతీ నెల ఆమెకు జీతం వస్తుంది. వచ్చిన జీతాన్ని ఆమె విత్‌డ్రా కూడా చేసుకుంటుంది. అలా 16 ఏళ్లలో రూ.11 కోట్లకు పైగా సంపాదించింది. ఆమె ఉద్యోగానికి రావడం లేదనే సమాచారం తెలియడానికి ఇప్పటికి.. అంటే 16 ఏళ్లు గడిచాయి. ఈ 16 ఏళ్లలో ఆ మహిళ ఒక్క రోజు కూడా కళాశాలలో పని చేయలేదు. కానీ ప్రతి నెలా పూర్తి జీతం తీసుకుంటూ ఉంది. ఈ పరిస్థితి వ్యవస్థలోని లోపం వల్ల తలెత్తిందని పలువురు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.

READ ALSO: Albania: అల్బేనియాలో ఏఐ సూర్యుడు.. డియెల్లా మామూలుగా లేదుగా..

Exit mobile version