NTV Telugu Site icon

German Minister: యూపీఐ పనితీరు చూసి ఆశ్చర్యపోయిన జర్మనీ మంత్రి

Upi

Upi

German Minister UPI Payment: యూపీఐ పేమెంట్స్.. మనదేశంలో ఇప్పుడు ఎక్కడ చూసిన ఇవే కనిపిస్తున్నాయి. చిన్న టీ షాపు దగ్గర నుంచి పెద్ద పెద్ద మాల్స్ వరకు ఈ యూపీఐ సేవలు చేయడానికి వీలుంటుంది. జస్ట్ ఒక్క క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి ఈ పేమెంట్స్ చేయవచ్చు. ఇవి చేయడం కూడా ఎంతో సులభంగా ఉండటంతో చాలా మంది వీటిని ఉపయోగిస్తు్న్నారు. డిజిటల్ ఇండియాలో భాగంగా భారతప్రభుత్వం కూడా వీటిని ప్రోత్సహిస్తోంది. భారతదేశమంతటా యూపీఐ సేవలు విదేశీయులను సైతం ఆకర్షిస్తున్నాయి. ఈ విధానంపై ఎంతో ఆసక్తి నెలకొంది. యూపీఐ సేవలు వివిధ దేశాలకు కూడా విస్తరిస్తున్నాయి. అనేక దేశాలు ఈ విధానాన్ని మెచ్చుకుంటున్నాయి. తాజాగా జర్మనీ మంత్రి విస్సింగ్ కూడా యూపీఐ పేమెంట్ విధానాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఈ విషయాన్ని స్వయంగా జర్మన్ ఎంబసీనే ఎక్స్ (ట్విటర్) వేదికగా వెల్లడించింది.

Also Read: Pilot: అంత కోపం ఏందయ్యా నీకు…బారియర్ గేట్ తెరుచుకోలేదని గొడ్డలితో విరగొట్టిన పైలెట్

“భారత్ దేశ విజయవంతమైన వ్యవస్థల్లో యూపీఐ కూడా ఒకటి. ప్రతి ఒక్కరూ సెకండ్లలోనే లావాదేవీలు పూర్తి చేసేందుకు యూపీఐ వీలు కల్పిస్తోంది. కోట్లాది మంది భారతీయులు దీన్ని వినియోగిస్తున్నారు. డిజిటల్, ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్ విస్సింగ్ సైతం యూపీఐ చెల్లింపుల సులభతరాన్ని స్వయంగా వీక్షించారు’’ అని జర్మనీ ఎంబసీ పోస్ట్ చేసింది. బెంగళూరులో ఓ కూరగాయల వర్తకుడికి యూపీఐ ద్వారా డబ్బులు చెల్లించారు విస్సింగ్. బెంగళూరులో ఆగస్టు 19న జరిగిన జీ20 దేశాల సమావేశాల కోసం వచ్చిన జర్మనీ మంత్రి విస్సింగ్ యూపీఐ ద్వారా పేమెంట్ చేశారు. దీని సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన యూజర్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. త్వరలో మనం ప్రపంచాన్ని ఏల బోతున్నాం అని చాలా మంది ఈ వీడియోపై స్పందిస్తున్నారు. ఇక యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్ అనేది మొబైల్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ అని తెలిసిందే. దీన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ అభివృద్ధి చేసింది. దాదాపు దేశంలో ఎక్కువ ట్రాన్సక్షన్ లు అన్నీ ఈ విధానంలోనే జరుగుతున్నాయి.