Site icon NTV Telugu

CM Revanth Reddy: సీఎంతో జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేల్ హాస్పర్ బృందం భేటీ.. ఈ అంశాలపై చర్చ..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేల్ హాస్పర్ బృందం భేటీ అయ్యింది. డ్యుయిష్ బోర్స్ ( Deutsche Borse) కంపెనీ విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో ఇవాళ తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్(GCC)ని ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రికి జర్మనీ బృందం వివరించింది. GCC ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంచుకున్నందుకు జర్మనీ బృందానికి సీఎం ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని, ఇందుకు ప్రజాప్రభుత్వం పూర్తి మద్దతుగా నిలిచి అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ డ్యుయిష్ బోర్స్ ( Deutsche Borse) కంపెనీ GCC ఏర్పాటుతో వచ్చే రెండేళ్లలో ఐటీ రంగంలో వెయ్యి మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలగనున్నట్లు జర్మనీ బృందం వివరించింది.

READ MORE: Mastiii 4 Trailer: మళ్లీ మస్తీ మోడ్‌లో.. రితీశ్‌ దేశ్‌ముఖ్ ‘మస్తీ 4’ ట్రైలర్‌ రిలీజ్‌

హైదరాబాద్‌లో ఇన్నోవేషన్ హబ్ గా తయారు చేసేందుకు సహకరించాలని జర్మనీ బృందాన్ని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. హైదరాబాద్‌లో జర్మనీ టీచర్లను నియమించి తెలంగాణ విద్యార్థులకు జర్మనీ భాషను నేర్పించేందుకు సహకరించాలని జర్మనీ కాన్సుల్ జనరల్‌కు విజ్ఞప్తి చేశారు. పెట్టుబడుల విషయంలో తెలంగాణ జర్మనీ భాగస్వామ్యాన్ని కోరుకుంటోందన్నారు. ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్ రంగంలో జర్మనీ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలన్నారు. వీటితో TOMCOM ద్వారా పాటు వొకేషనల్ ఎడ్యుకేషన్, స్కిల్ వర్క్ విషయంలో శిక్షణ అందించేందుకు సహకరించాలని కోరారు. ఈ భేటీలో అమిత దేశాయ్, డ్యుయిష్ బోర్స్ CIO/COO డాక్టర్ క్రిస్టోఫ్ బోమ్, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version