నటి జెనీలియా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తెలుగులో జెనీలియా ఎన్ని సినిమాలు చేసిన కూడా బొమ్మరిల్లు సినిమాలో హాసిని పాత్ర ఇప్పటికీ గుర్తుండి పోతుంది.. ఆమె నటించిన బొమ్మరిల్లు సినిమా అద్భుత విజయం సాధించింది.. బొమ్మరిల్లు సినిమాలో హాసిని పాత్రలో జెనీలియా అద్భుతంగా నటించి మంచి గుర్తింపు సంపాదించింది.. ఆ తరువాత తెలుగులో ఎన్నో హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా మారింది.ఆ తరువాత ఈ భామ బాలీవుడ్ హీరో రితేష్ దేశముఖ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ తరువాత భర్తతో కలిసి కొన్ని హిందీ సినిమాల్లో కూడా నటించింది.. పెళ్లి తరువాత ఇంటి భాద్యతలను తీసుకున్న జెనీలియా ఆ తరువాత సినిమాలను చేయడం తగ్గించేసింది.వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే జెనీలియా మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. గత ఏడాది భర్తతో కలిసి మిస్టర్ మమ్మీ మరియు వేద్ సినిమాల్లో నటించింది. ఇప్పుడు ఓటిటిలోకి కూడా ఎంట్రీ ఇవ్వడానికి ఆమె సిద్ధంగా ఉంది.. అయితే జెనీలియా ఓటిటిలో విడుదలయ్యే సినిమాలపై షాకింగ్ కామెంట్స్ ను చేసింది. ఇప్పుడు ఈ వ్యాPreview (opens in a new tab)ఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
జెనీలియా నటించిన తాజా వెబ్ సిరీస్ ట్రయల్ పీరియడ్ జులై 21 నుంచి ఓటీటీ జియో సినిమా లో విడుదల కానుంది.ఈ సినిమా గురించి చెబుతూ ఈ సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని తెలిపింది.ఓటిటిలో వచ్చే సినిమాలపై కొన్ని కామెంట్స్ చేసింది. ఇప్పుడు ఓటిటిలో వచ్చే కొన్ని సినిమాలు కుటుంబంతో కలిసి చూడలేకపోతున్నాము అంటూ కామెంట్స్ చేసింది. కుటుంబంతో కలిసి చూసే కథలు అంతగా రావడం లేదని, పిల్లలతో కలిసి ఓటిటిలో సినిమాలు చూసే పరిస్థితి ఇప్పుడు లేకుండా పోయింది. అందుకే పూర్తి ఫ్యామిలీ సినిమా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ట్రయల్ పీరియడ్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని ఆమె తెలిపింది. ఈ సినిమాను కుటుంబంతో కలిసి చూడవచ్చని ఆమె తెలిపింది.అయితే జెనీలియా చేసిన కామెంట్లు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి.