Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gen Z Side Hustles: జీతాల సంగతి అటు ఉంచితే.. ఖర్చులు పెరిగిపోతున్నాయి.. అన్ని వస్తువుల ధరలు ఆకాశంవైపు చూస్తున్నాయి.. ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు వెహికల్ తీయాలన్నా.. ఆటో, బస్సు ఎక్కాలన్నా.. షాపింగ్‌కి వెళ్లినా.. నిత్యావసరాల కోసం మార్కెట్‌కు వెళ్లినా జేబుకు చిల్లు పడుతుంది.. పెరుగుతున్న ఖర్చులు, ఆర్థిక అనిశ్చితి, భవిష్యత్తుపై ఆందోళనల కారణంగా జెన్ జెడ్ (జెన్‌జీ) తరం తమ ప్రధాన ఉద్యోగంతో పాటు అదనపు పనులు చేయడానికి మొగ్గు చూపుతున్నట్లు ఓ సర్వే వెల్లడించింది. కేవలం నెలవారీ జీతంపై ఆధారపడటం కష్టంగా మారడంతో ఫ్రీలాన్సింగ్, కంటెంట్ క్రియేషన్, ఆన్లైన్ వర్క్, చిన్న వ్యాపారాల వంటి మార్గాల ద్వారా అదనపు ఆదాయం సంపాదించేందుకు యువత ప్రయత్నిస్తున్నారు.
ఆర్థిక ఆందోళనలతో కీలక నిర్ణయాలకు బ్రేక్
డెలాయిట్ 2026 జెన్ జెడ్, మిలీనియల్ సర్వే ప్రకారం.. భారతదేశంలో 54 శాతం మంది జెన్‌జీ ఆర్థిక ఆందోళనల కారణంగా తమ జీవితంలోని ప్రధాన నిర్ణయాలను వాయిదా వేసినట్లు తెలిపారు. అదే సమయంలో 20 శాతం మంది తమ రోజువారీ, నెలవారీ ఖర్చులను భరించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు. ఇంటి కొనుగోలు, పొదుపు, భవిష్యత్తుకు ఆర్థిక భద్రత కల్పించడం వంటి అంశాలు యువతకు పెద్ద సవాళ్లుగా మారుతున్నాయి. దీంతో అదనపు ఆదాయం కోసం మరో మార్గాన్ని వెతుక్కోవడం జెన్ జెడ్‌లో సాధారణంగా మారుతోంది.
Also Read
- CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
- Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
- Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
- Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
ఉద్యోగంతో పాటు సైడ్ హస్ల్
ప్రధాన ఉద్యోగం చేస్తూనే అదనపు పని చేయడాన్ని ‘సైడ్ హస్ల్’గా పిలుస్తారు. ప్రస్తుతం జెన్ జెడ్‌లో ఇది కేవలం హాబీగా కాకుండా ఆర్థిక అవసరంగా కూడా మారుతోంది. డెలాయిట్ 2026 నివేదిక ప్రకారం.. జెన్ జెడ్‌లో దాదాపు 30 శాతం మంది పార్ట్‌టైమ్ లేదా ఫుల్‌టైమ్ సైడ్ జాబ్స్ చేస్తున్నట్లు వెల్లడైంది. ఫ్రీలాన్సింగ్, కంటెంట్ క్రియేషన్, ఆన్లైన్ వర్క్, చిన్న వ్యాపారాలు వంటి మార్గాల ద్వారా యువత తమ ప్రధాన జీతానికి అదనంగా ఆదాయం పొందుతున్నారు. పెరుగుతున్న జీవన వ్యయాలను ఎదుర్కోవడంతో పాటు పొదుపు, భవిష్యత్తు అవసరాల కోసం ఈ అదనపు ఆదాయాన్ని ఉపయోగించుకుంటున్నారు.
డబ్బుతో పాటు కొత్త నైపుణ్యాలు
అంతే కాదు.. సైడ్ హస్ల్స్ ద్వారా వచ్చే ప్రయోజనం కేవలం అదనపు ఆదాయానికే పరిమితం కావడం లేదట యువత.. అదనపు పనులు చేస్తున్న జెన్ జెడ్‌లో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ మంది వీటి ద్వారా కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడంతో పాటు కొత్త పరిచయాలు ఏర్పరచుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు.. ప్రధాన ఉద్యోగం ద్వారా స్థిరత్వం, అనుభవం పొందుతూనే.. సైడ్ హస్ల్ ద్వారా తమకు నచ్చిన రంగాలను అన్వేషించే అవకాశం యువతకు లభిస్తోంది. భవిష్యత్తులో ఈ అనుభవాన్ని పెద్ద వ్యాపారంగా మార్చుకోవాలనే ఆలోచన కూడా కొందరిలో ఉంది.
మొత్తంగా పెరుగుతున్న ఖర్చులు, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో జెన్ జెడ్ (జెన్‌జీ) ఆలోచనా విధానంలో మార్పు కనిపిస్తోంది. ఒక ఉద్యోగం ద్వారా స్థిరమైన ఆదాయం పొందుతూనే, ఆదాయానికి మరో మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని యువత భావిస్తోంది. అందుకే సైడ్ హస్ల్స్ ఇప్పుడు జెన్ జెడ్‌కు కేవలం హాబీ కాకుండా ఆర్థిక భద్రతకు ఒక మార్గంగా మారుతున్నాయి.. పెరిగిపోతున్న ఖర్చులను ఎదుర్కొంటూ.. తమ భవిష్యత్ అవసరాలు.. ఆర్థిక స్థిరత్వం కోసం ప్లాన్ చేసుకుంటున్నారు..
తాజావార్తలు
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
-
Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
ట్రెండింగ్
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!