రాకింగ్ స్టార్ యష్ హీరోగా వస్తున్న ‘టాక్సిక్’ టీజర్‌లోని ఒక శృంగార సన్నివేశం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తున్న సంగతి తెలిసిందే. ఒక మహిళా దర్శకురాలై ఉండి ఇంత బోల్డ్ సీన్ ఎలా తీశారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తుండగా, గీతూ మోహన్‌దాస్ తాజాగా సెటైరికల్‌గా స్పందించారు. ‘స్త్రీల ఆనందం, వారి సమ్మతి గురించి జనం ఇంకా చర్చించుకుంటూనే ఉన్నారు.. నేను మాత్రం చిల్ అవుతున్నాను’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఘాటుగా బదులిచ్చారు. ఆ సీన్ కేవలం శృంగారం మాత్రమే కాదని, అది స్త్రీల స్వేచ్ఛకు మరియు వారి మనోభావాలకు అద్దం పట్టే అంశమని ఆమె పరోక్షంగా పేర్కొన్నారు. అలాగే ఆ సన్నివేశంలో ఉన్న నటి పేరు బీట్రిస్ బాచ్ అని, ఆమెను తన ‘సిమెట్రీ గర్ల్’ అని గీతూ పరిచయం చేశారు.
Also Read : Amitabh Bachchan: బిగ్ బి అమితాబ్ బచ్చన్‌కు తప్పిన ప్రమాదం.. ఎయిర్‌పోర్ట్‌లో పగిలిన అద్దాలు!
అయితే గీతూ మోహన్‌దాస్ స్పందనపై సోషల్ మీడియాలో భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో సినిమాల్లో మహిళలను అశ్లీలంగా చూపించడంపై పోరాడిన గీతూ, ఇప్పుడు తన సినిమాలో ఇలాంటి దృశ్యాలు పెట్టడం ఏంటీ? అంటే దీని బట్టి ఆమె ‘ద్వంద్వ వైఖరి’కి నిదర్శనమని కొందరు విమర్శిస్తున్నారు.. ‘వేరే వాళ్ళు తీస్తే బూతు.. మీరు తీస్తే సినిమానా?’ అంటూ కొందరు యూట్యూబర్లు.. అలాగే నెటిజన్లు సూటిగా ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, రాంగోపాల్ వర్మ వంటి వారు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటుండగా, ఇది ‘పెద్దల కోసం తీసిన కథ (A Fairy Tale for Grown-Ups)’ అని, అందుకే ఇలాంటి సీన్స్ తప్పవని ఆమె అభిమానులు సమర్థిస్తున్నారు. ఏదేమైనా, ఈ వివాదం సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.
