NTV Telugu Site icon

Geethanjali Malli Vachindi : ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Whatsapp Image 2024 05 06 At 7.21.28 Am

Whatsapp Image 2024 05 06 At 7.21.28 Am

క్యూట్ బ్యూటీ అంజలి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ హారర్ కామెడీ మూవీ ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. 2014లో సూపర్ హిట్ అయిన గీతాంజలికి సీక్వెల్‍గా ఈ సినిమా తెరకెక్కింది.ఈ మూవీకి భాను భోగవరపు మరియు కోన వెంకట్  కథ, స్క్రీన్‍ప్లే అందించగా శివ తుర్లపాటి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేశ్, షకలక శంకర్, సత్య, సునీల్, అలీ మరియు రవి శంకర్ కీలకపాత్రలు పోషించారు.హీరోయిన్ అంజలి 50 వ సినిమా గా వచ్చిన ఈ మూవీ భారీ అంచనాలతో ఈ ఏడాది ఏప్రిల్ 11వ తేదీన థియేటర్లలో విడుదల అయింది.

కానీ ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ హారర్ కామెడీ మూవీ అంతగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది.ఈ సినిమాను ‘ఎంవీవీ సినిమా, కోనా ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లపై కోన వెంకట్ మరియు ఎంవీవీ సత్యనారాయణ నిర్మించారు.అలాగే ఈ మూవీకి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు.ఇదిలా ఉంటే తాజాగా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ మూవీ ఓటీటీ రిలీజ్ కు సిద్ధం అవుతుంది.ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్‍ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. మే 10వ తేదీన ఈ సినిమా ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుందని సమాచారం.త్వరలోనే ఈ మూవీ ఓటిటి రిలీజ్ గురించి అధికార ప్రకటన రానుంది.