Site icon NTV Telugu

Geetha Madhuri: గీతా మాధురి క్యాసినోలో ఎంత పోగొట్టిందంటే..!

Geetha

Geetha

Geetha Madhuri: సోషల్ మీడియాలో అప్పుడప్పుడు సెలబ్రిటీల కొన్ని విషయాలు అనవసరమైన చర్చలకు దారితీస్తుంటాయి. ఈ విధంగానే గాయని గీతా మాధురి సంబంధించి కూడా ఓ విషయంపై ఇదివరకు ఓ విషయంపై పుకార్లు వచ్చాయి. తాజాగా ఆమె ఎన్టీవీ పాడ్ కాస్ట్ లో భాగంగా ఆమె అనేక విషయాలపై మాట్లాడారు. అలాగే అనేక రూమర్స్ పై కూడా క్లారిటీ ఇచ్చారు.

T20 World Cup 2026: తిలక్‌ వర్మ దూరమైతే.. ప్రపంచకప్‌కు టీమిండియా ప్లేయింగ్‌ ఎలెవన్‌ ఇదేనా?

ఇదివరకు క్యాసినో గురించి మాట్లాడిన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి ఏర్పడింది. అయితే ఆ విషయమే ఆమె స్వయంగా క్లారిటీ ఇచ్చారు. తాను క్యాసినోలో ఎలాంటి పెద్ద మొత్తాన్ని పోగొట్టుకోలేదని ఆమె అన్నారు. అలాగే తన దృష్టిలో క్యాసినో అనేది కేవలం ఒక ఎంజాయ్‌మెంట్ స్పేస్ మాత్రమే అని, డబ్బు కోల్పోయే ప్రమాదకర ఆట కాదన్నారు. ఇంకా తాను క్యాసినోకు వెళ్లినప్పుడు కూడా క్యాలిక్యులేటెడ్‌గా మాత్రమే వ్యవహరించాను అని స్పష్టం చేసింది. ఇంటి ఫైనాన్సెస్ కానీ, సేవింగ్స్ కానీ, కుటుంబ ఆస్తులు కానీ ఎలాంటి వాటిని కూడా రిస్క్‌లో పెట్టే ప్రసక్తేలేదని ఆమె తేల్చి చెప్పింది.

Toxic Remunerations: ‘టాక్సిక్’ తారలకు భారీ రెమ్యూనరేషన్స్.. కియారా, నయనతారకు ఎంతో తెలుసా?

గీతా మాధురి ఇంకా ఫైనాన్షియల్ మ్యాటర్ సంబంధించి ఆమె మాట్లాడుతూ.. అవసరమైన చోట ఖర్చు చేయాలని, అవసరం లేని చోట నియంత్రణ ఉండాలని పేర్కొన్నారు. ఒకవేళ రిస్క్ తీసుకున్నా, అది కూడా వదిలేయగలిగిన డబ్బుతో మాత్రమే చేయాలని సూచించారు. అందుకే క్యాసినోలో కూడా ఆమె పెట్టిన డబ్బు అనేది పూర్తిగా ఎంజాయ్‌మెంట్ బడ్జెట్లో భాగమే తప్ప, జీవితాన్ని ప్రభావితం చేసే స్థాయిలో లేదని తెలిపింది. క్యాసినో కోసం ఆస్తులు అమ్మడం, అప్పులు చేయడం, జీవితాన్ని పణంగా పెట్టడం నాకు అస్సలు అర్థం కాదని ఆమె అన్నారు.

Exit mobile version