Geetha Madhuri: ఎన్టీవీ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న గాయని గీత మాధురి ఆమె జీవితంలో జరిగిన అనేక విషయాలపై చర్చించారు. ఈ సందర్బంగా ఆమె బిగ్ బాస్ లో ఫీమేల్ విన్నర్స్ ఎందుకు కారన్న విషయమై మాట్లాడింది. బిగ్ బాస్ సీజన్ 2లో మొదటి రన్నర్ గా నిలబడిన ఆమె ఆ షో సంబంధించి అనేక విషయాలను పంచుకున్నారు. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ..
Geetha Madhuri: గీతా మాధురి క్యాసినోలో ఎంత పోగొట్టిందంటే..!
బిగ్‌బాస్ హౌస్ అనేది సాధారణ గేమ్ కాదని గీత మాధురి అన్నారు. అది ఒక 100 రోజుల తీవ్రమైన మానసిక ప్రయాణమని.. అక్కడికి వెళ్లిన ప్రతి వ్యక్తి (పురుషుడైనా, మహిళైనా) ఎప్పుడో ఒక సమయంలో ‘వల్నరబుల్’ (శారీరకంగా లేదా మానసికంగా దాడి ద్వారా హాని కలిగించే) అవుతారని ఆమె అంటుంది. ముఖ్యంగా మహిళలకు ఆ ఒత్తిడి మరింత ఎక్కువగా అనిపిస్తుందని గీత మాధురి అభిప్రాయ పడ్డారు.
ఆమె బిగ్‌బాస్ హౌస్ గురించి మాట్లాడుతూ.. అక్కడ నిద్ర, సరైన ఆహారం ఉండదని.. అలాగే మనకు కావలసిన వాళ్లు ఉండరని అన్నారు. ఒక్కసారిగా మనల్ని ఒక గేమ్‌లోకి నెట్టేస్తారు. అక్కడ ప్రతి మాట, ప్రతి ఎమోషన్, ప్రతి కన్నీటి బొట్టు కూడా జడ్జ్ చేయబడుతుందని.. ఈ పరిస్థితుల్లో మహిళలు మరింతగా భావోద్వేగానికి లోనవుతారని ఆమె అన్నారు. ఎవరో మనతో మాట్లాడితే బాగుండని, ఎవరో మనను అర్థం చేసుకుంటే బాగుండని అనిపిస్తుందని అన్నారు. అదే సమయంలో “వాళ్లు నాతో నిజంగా మాట్లాడుతున్నారా..? లేక కంటెంట్ కోసమేనా..?” అనే డౌట్ కూడా వెంటాడుతుంది. ఈ అంతర్గత సంఘర్షణ మహిళలను మానసికంగా బలహీనంగా చేస్తుందని అన్నారు.
Trump-Machado: వైట్‌హౌస్‌కు రానున్న వెనిజులా ప్రతిపక్ష నేత మచాడో.. ఏం జరుగుతోంది?
బిగ్‌బాస్‌లో విన్నింగ్ లేదా లూజింగ్‌పై ఎక్కువగా ఫోకస్ పెట్టడం కంటే.. అక్కడ బతకడం, మానసిక స్థిరత్వం నిలుపుకోవడం చాలా కష్టం అన్నారు. ఒకవేళ ఎవరో అక్కడికి వెళ్లి, అంత డిస్ట్రాక్షన్ మధ్య కూడా కేవలం గెలుపు, ఓటమి మీద మాత్రమే ఫోకస్ చేయగలిగితే అలాంటి వ్యక్తి నిజంగా విన్నర్ అవ్వడానికి అర్హుడు అని గీత మాధురి అన్నారు. అయితే మహిళలు సాధారణంగా గేమ్ కంటే కూడా మానవ సంబంధాలు, భావోద్వేగాలు, పరిసరాల ప్రభావానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని.. అదే వారిని గెలుపు రేసులో కొంత వెనక్కి నెట్టే అంశంగా మారుతుందని ఆమె తన అభిప్రాయాన్ని తెలిపారు.
