NTV Telugu Site icon

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ రద్దు.. గెటిట్ విడుదల

Ts Assemby

Ts Assemby

తెలంగాణలో అసెంబ్లీ రద్దు చేస్తున్నట్లు రాజ్ భవన్ వర్గాలు గెజిట్ విడుదల చేస్తుంది. అయితే, కొత్త అసెంబ్లీ శాసనసభను ఏర్పాటు చేస్తూ కూడా జీవోను జారీ చేసింది. గవర్నర్‌ తమిళిసైకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్ నేతృత్వంలోని బృందం జాబితాను అందజేసింది. గెలిచిన ఎమ్మెల్యేల జాబితాను కూడా గవర్నర్‌కు సీఈవో వికాస్‌రాజ్‌ ఇచ్చారు. దీంతో తెలంగాణలో మూడో అసెంబ్లీ ఏర్పాటైంది. మంత్రివర్గ సిఫార్సు మేరకు రెండో శాసనసభను గవర్నర్‌ తమిళిసై క్యాన్సిల్ చేశారు.

Read Also: Eagle: ఆ లుక్ ఏంటి రవన్న.. మాస్ కే బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నావే

ఇక, కొత్త సీఎంకు సంబంధించిన ప్రమాణ స్వీకార ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది. ఎన్నికల కమిషన్ బృందం గవర్నర్‌ను కలవడంతో కాంగ్రెస్ ప్రతినిధి టీమ్ కూడా కాసేపట్లో గవర్నర్‌ను కలవనున్నారు. కాంగ్రెస్ సీఎల్పీ నేతగా ఎన్నికైన వారి పేరును గవర్నర్‌కు నివేదించి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా వారు కోరనున్నారు. ఆ తర్వాత సీఎల్పీ నేత సీఎంగా ప్రమాణ స్వీకారానికి గవర్నర్ తమిళిసై ఆహ్వానిస్తారు. వీలైనంత వరకు ఈ ప్రక్రియ ఇవాళే జరిగే ఛాన్స్ ఉంది.

Read Also: Rabbit Farming: కుందేళ్ల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

సీఎం ప్రమాణస్వీకారం కోసం రాజ్ భవన్‌లో ఇప్పటికే ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నాయి. నేడు ప్రమాణ స్వీకారం ఉండవచ్చన్న సమాచారంతో ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమం కోసం అవసరమైన కుర్చీలు, టెంట్లు, సహా ఇతరత్రా సామగ్రిని ఇప్పటికే తీసుకెళ్లారు. సాధారణ పరిపాలనా శాఖ, ఆర్‌అండ్‌బీ, జీహెచ్ఎంసీ సహా ఇతర శాఖల అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తు్న్నారు. శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు రాజభవన్‌కు వెళ్లి.. ప్రస్తుతం అసెంబ్లీ రద్దు తీర్మాన ప్రతిని గవర్నర్‌కు అందజేశారు. ఇక, కొత్త మంత్రుల కోసం వెహికిల్స్ ను అధికారులు రెడీ చేశారు.