Gautam Gambhir Heap Praise on MS Dhoni: ప్రతిసారి టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై అక్కసు వెళ్లగక్కే మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్.. ఈసారి ప్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియా అత్యుత్తమ కెప్టెన్ ధోనీ అని పేర్కొన్నాడు. భారత్ తరఫున మహీ సాధించిన రికార్డును అందుకోవడం చాలా కష్టమన్నాడు. ఇద్దరం కలిసి ఎన్నో మధుర క్షణాల్లో భాగస్వామిగా ఉన్నామని గౌతీ గుర్తుచేశాడు. ఆదివారం (జులై 7) ధోనీ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ధోనీ గురించి స్టార్ స్పోర్ట్స్ ఓ ప్రత్యేక వీడియోను రిలీజ్ చేయగా.. అందులో గంభీర్ మాట్లాడాడు.
‘ఎంతో మంది కెప్టెన్లు వస్తారు, వెళతారు. భారత జట్టులో ఎంఎస్ ధోనీ రికార్డును అందుకోవడం చాలా కష్టం. టెస్ట్‌లలో నంబర్ 1 ర్యాంక్ అందుకోవచ్చు,విదేశీ మ్యాచ్‌లను గెలవవచ్చు కానీ.. రెండు ఐసీసీ ప్రపంచకప్‌లను, ఓ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని అందుకోవడం ఎంతో ప్రత్యేకం. ఇంత కంటే గొప్ప విజయం మరొకటి లేదు. మేం ఇద్దరం కలిసి ఎన్నో కీలక ఘట్టాల్లో పాలుపంచుకున్నాం. టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్, ఆస్ట్రేలియాలో కామెన్‌వెల్త్ సిరీస్, న్యూజిలాండ్‌లో టెస్టు సిరీస్ విజయాలు.. దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ డ్రా చేయడం, ఆసియా కప్ విజేతగా నిలవడం.. ఇలా ఎన్నో మధుర క్షణాల్లో భాగస్వామిగా ఉన్నాను. ధోనీ భారతదేశ అత్యుత్తమ కెప్టెన్’ అని గౌతమ్ గంభీర్ వీడియోలో పేర్కొన్నాడు.
Also Read: Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ!
ఎంఎస్ ధోనీ టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలను అందించిన విషయం తెలిసిందే. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలను అందించాడు. ఇక ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఏకంగా 5 టైటిళ్లు అందించాడు. 2024 సీజన్‌లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోనీ.. వికెట్ కీపర్‌గా జట్టులో ఉన్నాడు. మహీ ఇనక ఐపీఎల్ రిటైర్మెంట్‌ను ప్రకటించలేదు. అతను వచ్చే సీజన్‌లో కూడా ఆడాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక గౌతమ్ గంభీర్ టీమిండియా కోచ్‌గా ఎంపికయ్యే అవకాశాలు నాయి. ఇప్పటికే ఇంటర్వ్యూ పూర్తయింది.