Gautam Gambhir: గత ఏడాది న్యూజిలాండ్ ఇప్పుడు దక్షిణాఫ్రికా భారతదేశానికి వచ్చి టెస్ట్ సిరీస్‌లలో టీమిండియాను వైట్‌వాష్ చేశాయి. ఈ రెండు సిరీస్‌లలో టీమిండియా ఓడిపోయింది. ఈక్రమంలో గౌతమ్ గంభీర్‌ను ప్రధాన కోచ్‌గా తొలగించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ డిమాండ్లపై గౌతమ్ తనదైన శైలిలో స్పందించారు. తన నాయకత్వంలోనే జట్టు ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుందని గంభీర్ స్పష్టం చేశారు. అయితే హెడ్ కోచ్ పదవి విషయంలో తాను ఏ నిర్ణయం తీసుకోనని, భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
READ ALSO: పోకో నుండి సర్‌ప్రైజ్.. Poco Pad X1, Pad M1 గ్లోబల్‌గా లాంచ్.. ధరలు, స్పెసిఫికేషన్లు ఇవే..!
టెస్ట్ కోచింగ్‌పై గంభీర్ స్పందన..
దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌లో టీమిండియా ఓటమి తర్వాత, గంభీర్ విలేకరుల సమావేశంలో పదునైన అనేక ప్రశ్నలను ఎదుర్కొన్నాడు. టెస్ట్ కోచ్‌గా తన భవిష్యత్తు గురించి విలేకరులు అడిగినప్పుడు, గంభీర్ స్పందిస్తూ తన పదవీకాలంపై బీసీసీఐపై నిర్ణయం తీసుకుంటుందని చెప్పాడు. “ఈ నిర్ణయం తీసుకోవడం బీసీసీఐ బాధ్యత. కోచ్ అయిన తర్వాత నా మొదటి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నేను ముఖ్యం కాదు, భారత క్రికెట్ ముఖ్యం అని చెప్పాను కదా. అది ఎప్పటికీ మర్చిపోవద్దు, ఇంగ్లాండ్‌లో టెస్ట్ సిరీస్‌ను డ్రా చేసుకోవడానికి, ఛాంపియన్స్ ట్రోఫీని, ఆసియా కప్‌ను గెలవడానికి జట్టును నడిపించిన వ్యక్తి నేనే” అని గంభీర్ చెప్పాడు.
ప్రస్తుత టీమిండియా జట్టులో అనుభవం లేదని గంభీర్ అన్నారు. అంతేకాకుండా టెస్ట్ క్రికెట్‌లో నంబర్ వన్ జట్టుగా భారత్ ఎదగాలంటే, ఈ ఫార్మాట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. “మనం బాగా ఆడాలి. అకస్మాత్తుగా 95/1 నుంచి 122/7కి వెళ్లడం ఆమోదయోగ్యం కాదు. దీనికి ఏ ఒక్క ఆటగాడిని లేదా ఏ ఒక్క షాట్‌ను నిందించలేం. నేను ఎవరినీ ఎప్పుడూ నిందించలేదు, అలా నేను ఎప్పటికీ చేయను” అని గౌతమ్ గంభీర్ అన్నారు.
గత ఏడాది కాలంలో టీమిండియా రికార్డు..
న్యూజిలాండ్ చేతిలో 0-3 తేడాతో ఓడిన టీమిండియా ఇప్పుడు దక్షిణాఫ్రికా చేతిలో 2-0 తేడాతో ఓడిపోయింది. కోల్‌కతా టెస్ట్‌లో 30 పరుగుల తేడాతో ఓడిపోయిన తర్వాత, గౌహతి టెస్ట్‌లో కూడా టీమిండియా 408 పరుగుల దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. గత ఏడాది మూడు ఫార్మాట్లలో టీమిండియాకు కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గంభీర్ నాయకత్వంలో స్వదేశంలో జరిగిన తొమ్మిది మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ఇది ఐదవ ఓటమి. మిగిలిన నాలుగు విజయాలు బంగ్లాదేశ్, వెస్టిండీస్ వంటి బలహీన జట్లపై నమోదు చేసినవే.
READ ALSO: iQOO 15: 7000mAh బ్యాటరీ, ట్రిపుల్ 50MP కెమెరాలతో.. ఐకూ 15 విడుదల.. ధర ఎంతంటే?
