Site icon NTV Telugu

Gautam Gambhir: మీ హద్దుల్లో మీరు ఉంటే మంచిది.. టీమిండియా కోచ్ కీలక వ్యాఖ్యలు..!

Gautam Gambhir

Gautam Gambhir

Gautam Gambhir: సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో భారత్ వైట్‌వాష్‌కు గురైన నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ (DC) సహ-యజమాని పార్థ్ జిందాల్, టెస్టు క్రికెట్‌కు వేరే స్పెషలిస్ట్ కోచ్ ఉండాలన్న డిమాండ్‌పై గంభీర్ తీవ్రంగా స్పందించారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాపై భారత్ వన్డే సిరీస్ విజయం సాధించిన అనంతరం జరిగిన పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో కోచ్ గంభీర్.. జిందాల్ పేరు ప్రస్తావించకుండానే “తమ హద్దుల్లో ఉండండి” అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చారు.

Tirupati: నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో కీచక పర్వం.. విద్యార్థిని ప్రెగ్నెంట్ చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్

మేము సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో ఓడిపోయినప్పుడు రకరకాల విషయాలు మాట్లాడారు. వాటిలో సగం క్రికెట్‌కు సంబంధించినవి కూడా కావని గంభీర్ విలేకరులతో అన్నారు. ఒక ఐపీఎల్ యజమాని కూడా స్ప్లిట్ కోచింగ్ గురించి రాశారు. మేము ఎవరి జోలీకి వెళ్లం, కాబట్టి ఎవరి పరిధిలో వారు ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే మేము ఒకరి జోలీకి వెళ్లనప్పుడు, వారు కూడా మా జోలీకి రావడానికి హక్కు లేదని గంభీర్ వ్యాఖ్యానించాడు.

ఇక కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో రెండున్నర రోజుల్లో ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌ పిచ్‌ గురించి చాలా చర్చ జరిగిందని గంభీర్ గుర్తు చేశారు. అయితే ఆ మ్యాచ్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెడ గాయం కారణంగా రెండు ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్‌కు దిగలేకపోవడం గురించి ఎవరూ మాట్లాడలేదని గంభీర్ ఆవేదన వ్యక్తం చేశారు. గిల్ ఆ తర్వాత వన్డేలకు కూడా దూరమయ్యాడు. ఫలితాలు అనుకున్న విధంగా రానప్పుడు చాలా చర్చ జరుగుతుంది. కానీ ఏ మీడియాలోనూ లేదా ఏ జర్నలిస్టు కూడా మా తొలి టెస్టు కెప్టెన్ లేకుండా జరిగిందనే విషయం రాయలేదు. గాయం కారణంగా మా కెప్టెన్ రెండు ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేయలేకపోయాడని గంభీర్ వివరించారు.

IND vs SA: టీమిండియా విజయానికి ఐదు ప్రధాన కారణాలు ఇవే..

నేను ప్రెస్ కాన్ఫరెన్స్‌లలో సాకులు చెప్పను. అలాగని మీరు నిజాలను ప్రపంచానికి లేదా దేశానికి చూపవద్దని కాదు. జట్టు మార్పు దశలో ఉన్నప్పుడు, రెడ్ బాల్ క్రికెట్‌లో మీ ముఖ్య బ్యాటర్‌తో పాటు కెప్టెన్‌ను కోల్పోయినప్పుడు ఇలాంటివి జరుగుతాయని గంభీర్ తన అసంతృప్తిని వెలిబుచ్చారు. గిల్ ఫామ్‌లో ఉన్నప్పటికీ అతని సేవలను అందుబాటులో లేకపోవడం గురించి ఎవరూ మాట్లాడలేదని ఆయన వ్యాఖ్యానించారు.

Exit mobile version