NTV Telugu Site icon

Asia’s richest person: అత్యంత ధనవంతుడిగా అదానీ.. అంబానీ స్థానం ఎంతంటే..?

Adani

Adani

అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ కొత్త ఏడాదిలో ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచాడు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ధనవంతుల జాబితాలో అదానీ 12వ స్థానంలో ఉండగా.. అదానీ నికర విలువ 97.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అదే సమయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ 97 బిలియన్ డాలర్ల సంపదతో ఆసియాలో రెండో స్థానానికి, ప్రపంచంలో 13వ స్థానానికి దిగజారిపోయారు. గౌతమ్ అదానీ కంటే ముందు ముఖేష్ అంబానీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడుగా ఉన్నారు.

Read Also: Harirama Jogaiah Open Letter: పవన్‌ కల్యాణ్‌కు మరోసారి హరిరామ జోగయ్య బహిరంగ లేఖ.. ఇలా చేయండి..!

ఇక, బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ డేటా ప్రకారం.. కొత్త సంవత్సరంలో ప్రపంచంలోని టాప్ -20 బిలియనీర్లలో ముగ్గురి నికర విలువ మాత్రమే పెరిగినట్లు చెప్పింది. వీటిలో అదానీ, అంబానీలే కాకుండా అమెరికాకు చెందిన వారెన్ బఫెట్ కూడా ఉన్నారు. గౌతమ్ అదానీ నికర విలువలో విపరీతమైన పెరుగుదల కనిపించింది. అతని సంపద 24 గంటల్లో 7.6 బిలియన్ డాలర్లు పెరిగిందని బ్లూమ్ బెర్గ్ పేర్కొనింది.

Read Also: Naa Saamiranga: ఈ సాంగ్ ఇంత ఎమోషనల్ గా ఉందేంటి?

అయితే, అదానీ గ్రూప్‌కు చెందిన పది లిస్టెడ్ కంపెనీలు తమ మార్కెట్ క్యాపిటలైజేషన్‌కు దాదాపు 65,500 కోట్ల రూపాయలను జోడించింది. హిండెన్‌బర్గ్ రిపోర్ట్ ఆరోపణలపై విచారించిన సుప్రీం కోర్టు గౌతమ్ అదానికి అనుకులంగా తీర్పు ఇవ్వడంతో.. ఒక్కసారిగా ఆ కంపెనీ షేర్లలో పెరుగుదల కనిపించింది. దీంతో అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒకరోజు క్రితం రూ.14.47 లక్షల కోట్ల నుంచి బుధవారం నాటికి రూ.15.11 లక్షల కోట్లకు పెరిగిపోయింది. దీంతో ముఖేష్ అంబానీని అధిగమించి ఆసియాలోనే అత్యంత ధనవంతుల జాబితాలో తొలి స్థానాన్ని గౌతమ్ అదానీ దక్కించుకున్నారు.