Site icon NTV Telugu

Gas cylinder leak : పాతబస్తీలో గ్యాస్ లీక్.. రోడ్డుపై జనం పరుగులు

Cyclendor

Cyclendor

హైదరాబాద్ పాతబస్తీ.. బిజీబిజీగా ఉండే రోడ్డులో అకస్మాత్తుగా ఓ ఆటో నిలిచిపోయింది. ఫస్ట్ డ్రైవర్ పరుగులు పెట్టాడు. అంతలోనే ఆటో వెనుక వెహికిల్స్ కూడా వాటిని వదిలేసి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని.. అక్కడి నుంచి పరుగులు పెట్టారు. అయితే, ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ ఏమైందంటే.. హైదరాబాద్ పాతబస్తీలో సంతోష్ నగర్ చాంద్రాయణగుట్ట ప్రధాన రహదారిపై సిలిండర్ల లోడ్ తో వెళ్తున్న ఓ ఆటోలో గ్యాస్ సిలిండర్ లీకైంది. దీంతో ఆటోను డ్రైవర్ రోడ్డుపై వదిలిపెట్టి పారిపోయాడు. గ్యాస్‌ లీక్‌ కావడంతో ప్రాణభయంతో రోడ్డు మీద వెళ్లే ప్రయాణికులు తమ వాహనాలు వదిలి ఉరుకులు, పరుగులు పెట్టారు.

Also Read : Deputy CM Amzath Basha: హజ్ యాత్రికులపై అదనపు భారం లేకుండా చూస్తాం..

దీంతో చాంద్రాయణగుట్ట ప్రధాన రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఇక.. గ్యాస్‌ లీకైన సమయంలో ఆటోలో 12 సిలిండర్లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. సమాచారమందుకున్న పోలీసులు.. హుటాహుటిన అక్కడికి చేరుకుని ప్రమాదం జరగకుండా తగిన చర్యలు తీసుకున్నారు. పోలీసుల అప్రమత్తతతో పాతబస్తీలో పెను ప్రమాదం తప్పింది. అయితే, గ్యాస్ లీక్ కావడంతో ఆటో డ్రైవర్ వెంటనే.. ఆటోను వదిలి పారిపోవడంతో వాహనదారులు ప్రాణభయంతో పరుగులు తీసినట్లు పోలీసులు వెల్లడించారు. కాంచన్ బాగ్ DRDL ప్రధాన రహదారిపై ఈ ఘటన జరగడంతో ఉక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది.

Also Read : Police Awards : రేపు ఉత్తమ పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు

వెంటనే విషయం తెలుసుకుని.. సంఘటన స్థలానికి చేరుకున్న ఫలక్ నుమా ట్రాఫిక్ పోలీసులు ఆటోను నిలిపివేసిన ప్రదేశం నుంచి వాహనదారులను దూరంగా పంపించారు. సిలిండర్లను ఆటో నుంచి దింపి పక్కన పెట్టారు. ఈ క్రమంలో సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే.. ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు. ఫలక్ నుమా ట్రాఫిక్ పోలీసుల సమయస్ఫూర్తితో పెద్ద ప్రమాదం తప్పిందంటూ.. స్థానికులు వారిని అభినందించారు.

Exit mobile version