NTV Telugu Site icon

Viral Video: పట్టపగలే లెక్చరర్ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ చోరీ.. సీసీటీవీ వీడియో వైరల్

Gas Cylinder

Gas Cylinder

Viral Video: ఓ కుర్రాడు ఇంట్లో ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ను ఎత్తుకెళ్లాడు. ప్రకాశం జిల్లా మార్కాపురం లోని భగత్ సింగ్ కాలనీలో గ్యాస్ సిలెండర్ దొంగతనం జరిగింది. పట్టపగలు ఓ లెక్చరర్ ఇంట్లో సిలెండర్ చోరీ జరిగింది. ఇంటి గేటు లోపలకు వెళ్లి బయట ఉన్న గ్యాస్ సిలిండర్‌ను ఎత్తుకెళ్లాడు దుండగుడు. ఈ దొంగతనం వ్యవహారమంతా సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. చోరీ జరిగిన సీసీటీవీ ఫుటేజీ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దర్జాగా ఇంటి గేటు దగ్గరకు వచ్చిన దుండగుడు.. పరిసర ప్రాంతాల్లో ఎవరూ లేరని తెలుసుకుని ఆ సిలిండర్‌ను భుజాన వేసుకొని వెళ్లాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు బాధితుడు. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు.

Read Also: SRH vs KKR: తడబడిన సన్ రైజర్స్.. 159 పరుగులకు ఆలౌట్