LPG Price Cut: ఆయిల్ కంపెనీల న్యూ ఇయర్ గిఫ్ట్.. భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర
- శుభవార్త చెప్పిన ఆయిల్ కంపెనీలు
- భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు
- డొమెస్టిక్ సిలిండర్ ధరలో నో ఛేంజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LPG Price Cut: కొత్త సంవత్సరం మొదటి రోజు ఆయిల్ కంపెనీలు సామాన్యులకు గొప్ప ఉపశమనం కలిగించే వార్ల వినిపించాయి. జూలై తర్వాత తొలిసారిగా దేశంలో గ్యాస్ సిలిండర్ల ధర తగ్గింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలలో ఈ తగ్గుదల కనిపించింది. మరోవైపు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. డొమెస్టిక్ సిలిండర్ ధరలో చివరిసారి తగ్గింపు మార్చి 2024లో హోలీకి ముందు కనిపించింది. దేశంలోని చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ల ధరలను నెల మొదటి తేదీన అప్డేట్ చేస్తాయి. 2025 మొదటి నెలలో డొమెస్టిక్, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కోసం ఎంత చెల్లించాలో ఈ వార్తలో తెలుసుకుందాం.
గృహ గ్యాస్ సిలిండర్ ధరలు
ఐఓసీఎల్ డేటా ప్రకారం, డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో ఎటువంటి మార్పు లేదు. దేశంలోని నాలుగు మహానగరాల్లో నివసించే వ్యక్తులు చివరిగా మార్చి 9, 2024న అప్డేట్ చేసిన ధరలనే చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు దేశీయ గ్యాస్ సిలిండర్ ధరను చమురు కంపెనీలు రూ.100 తగ్గించాయి. ఆ తర్వాత ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.803, కోల్‌కతాలో రూ.829, ముంబైలో రూ.802.50, చెన్నైలో రూ.818.50కి చేరింది.
Also Read
- బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సరికొత్త ఫీచర్లతో KTM 200 Duke లాంచ్..!
- Hyderabad: తెలంగాణలో ఆన్లైన్ మెడిసిన్ విక్రయాలపై కొరడా.. 32 మెడికల్ షాపులకు నోటీసులు
- Rudravanam PS: మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్.. అక్టోబర్ 30 నుంచి ‘రుద్రవనం పీఎస్’ స్ట్రీమింగ్.!
- WPL 2027 Auction: వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్‌కు అత్యధిక ధర.. సోఫీ మోలినెక్స్ను సొంతం చేసుకున్న యూపీ వారియర్స్..
Read Also:What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరల పతనం
మరోవైపు దాదాపు ఆరు నెలల తర్వాత కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.14.5 స్వల్పంగా తగ్గి రూ.1,804గా మారింది. కోల్‌కతాలో రూ.16 తగ్గింది. దీంతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1,911కి చేరుకుంది. ముంబైలో రూ.15 తగ్గిన తర్వాత ధర రూ.1,756గా మారింది. చెన్నైలో రూ.14.5 పతనం కాగా, సిలిండర్ ధర రూ.1,966గా ఉంది.
ఐదు నెలల్లో సిలిండర్ ఎంత పెరిగింది
అంతకుముందు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ 5 నెలల పాటు అంటే జూలై నుండి డిసెంబర్ వరకు నిరంతరంగా పెరిగింది. ఢిల్లీలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరల్లో రూ.172.5 పెరుగుదల కనిపించింది. కోల్‌కతా, చెన్నైలలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.171 పెరిగింది. ముంబైలో అత్యధికంగా రూ.173 పెరిగింది. రాబోయే రోజుల్లో ఈ గ్యాస్ సిలిండర్ల ధరలు, డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలలో తగ్గుదల ఉండవచ్చు.
Read Also:CM Chandrababu : మద్యం దుకాణదారులకు సీఎం చంద్రబాబు శుభవార్త
తాజావార్తలు
-
బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సరికొత్త ఫీచర్లతో KTM 200 Duke లాంచ్..!
-
Cancer Drug Price Cut 2026: క్యాన్సర్ మందుల ధరల్లో భారీ తగ్గింపు.. రూ.80 వేల ఇంజెక్షన్ ఇప్పుడు రూ.7,150కే!
-
WPL Auction 2027: వైభవ్ సూర్యవంశీ మాదిరే.. డబ్ల్యూపీఎల్‌లో అత్యంత పిన్న వయస్కురాలు.. ఎవరీ ఉమా కాశ్వి!
-
Hyderabad: తెలంగాణలో ఆన్లైన్ మెడిసిన్ విక్రయాలపై కొరడా.. 32 మెడికల్ షాపులకు నోటీసులు
-
Kumar Sangakkara: విమానాశ్రయంలో వివక్ష.. సంగక్కర సంచలన ఆరోపణలు!
ట్రెండింగ్
-
RCB Full Squad: నలుగురు కొత్త ప్లేయర్లు, స్టార్ ఆల్‌రౌండర్లు.. ఆర్సీబీ ఫుల్ స్క్వాడ్ ఇదే!
-
WPL Auction 2027: చాలా తక్కువ ధరకే స్టార్ ప్లేయర్లు.. ముంబై ఇండియన్స్ భలే లక్కీ.. ఫుల్ స్క్వాడ్ ఇదే!
-
6,100mAh బ్యాటరీ, కిరిన్ 8000S చిప్సెట్, AI సెక్యూరిటీ ఫీచర్లతో Huawei Enjoy 100 స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
Apple మొట్టమొదటిసారిగా టచ్‌స్క్రీన్ సదుపాయం.. PROLED XDR డిస్ప్లే, M5 ప్రాసెసర్లతో MacBook Pro లాంచ్..
-
Less Oil Cooking: తక్కువ నూనెతో రుచికరమైన వంటలు.. అడుగు అంటకుండా ఉండే స్మార్ట్ చిట్కాలు ఇవే..