NTV Telugu Site icon

Team India: త్వరలోనే భారత్ ప్రపంచకప్‌ గెలుస్తుంది: గ్యారీ కిరిస్టెన్‌

Team India

Team India

Gary Kirsten Says Team India will win World Cup: త్వరలోనే భారత్ ప్రపంచకప్‌ గెలుస్తుందని టీమిండియా మాజీ కోచ్‌ గ్యారీ కిరిస్టెన్‌ అన్నాడు. ప్రపంచకప్‌ను గెలవడం ఆషామాషీ వ్యవహారం కాదని, నాకౌట్‌ దశలో ఆస్ట్రేలియాను ఢీకొట్టడం ఎవరికైనా కష్టమే అని పేర్కొన్నాడు. కొన్ని విజయాలను నమోదు చేస్తే భారత్ ప్రపంచకప్‌ను నెగ్గడం ఖాయమని, అదీ త్వరలోనే సాకారం అవుతుందని తాను భావిస్తున్నా అని కిరిస్టెన్‌ చెప్పాడు. ఎంఎస్ ధోనీ సారథ్యంలో భారత్‌ 2011లో వన్డే ప్రపంచకప్‌ను గెలిచిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ నాయకత్వంలో 2023లో సాధించే అవకాశం తృటిలో మిస్‌ అయింది.

2024లో ఐసీసీ ట్రోఫీని భారత్ సాదిస్తుందని గ్యారీ కిరిస్టెన్‌ జోస్యం చెప్పాడు. ఓ జాతీయ మీడియాతో గ్యారీ కిరిస్టెన్‌ మాట్లాడుతూ… ‘ప్రపంచకప్ గెలవడం అంత సులువు కాదు. ఐసీసీ ట్రోఫీ గెలవడం చాలా కష్టం. నాకౌట్‌ దశలో ఆస్ట్రేలియాను ఢీకొట్టడం ఏ జట్టుకైనా కష్టమే. ఆస్ట్రేలియాతో అత్యున్నత స్థాయిలో పోటీపడే సామర్థ్యాన్ని భారత్ మాత్రమే కలిగి ఉంది. కొన్ని విజయాలను నమోదు చేస్తే.. భారత్ ప్రపంచకప్‌ను నెగ్గడం ఖాయం. త్వరలోనే అది సాకారం అవుతుందని భావిస్తున్నా. ఎందుకంటే సత్తా ఉన్న ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. మరికొన్ని నెలల్లో టీ20 ప్రపంచకప్‌ రానుంది. ఈ టోర్నీలో భారత్‌ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. అయితే నాకౌట్‌ దశలో మరింత జాగ్రత్తగా ఉండాలి’ అని కిరిస్టెన్‌ చెప్పాడు.

Also Read: Family Star : ‘ ఫ్యామిలీ స్టార్’ మ్యూజికల్ సందడి షురూ..మెలోడియస్ సాంగ్ ప్రోమో రిలీజ్..

‘వన్డే క్రికెట్‌ను బతికించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. గతంలోలా 4-4 దేశాలతో సిరీస్‌లను చూడాలని ఉంది. ప్రస్తతం ద్వైపాక్షిక సిరీస్‌లకు ఆదరణ కోల్పోవడం ఆందోళన కలిగించే విషయం. ప్రతి సంవత్సరం వన్డేలకు వరల్డ్ ఛాంపియన్‌ను నిర్వహిస్తే.. ఇంకా బాగుంటుంది. అలా చేస్తే వన్డే క్రికెట్‌ను రక్షించుకోగలం. ఇటీవల భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌కు ఎంత ఆదరణ ఉందో మనం చూశాం. నేను కూడా కొన్ని మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూశా. చాలా ఎంజాయ్ చేశా’ అని టీమిండియా మాజీ కోచ్‌ గ్యారీ కిరిస్టెన్‌ పేర్కొన్నాడు.