NTV Telugu Site icon

Garudan: ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చిన తమిళ బ్లాక్‌బస్టర్ గరుడన్

Garudan

Garudan

Garudan: తమిళ పరిశ్రమలో హాస్య పాత్రలకు పేరుగాంచిన, కొన్ని డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన సూరి ‘గరుడన్‌’తో అద్భుతమైన బ్లాక్‌బస్టర్‌ను అందించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 50 కోట్లకు పైగా వసూలు చేసింది. 2024లో కోలీవుడ్‌లో అతిపెద్ద హిట్‌లలో ఒకటిగా నిలిచింది. బ్లాక్‌బస్టర్ విడుతలై తర్వాత ప్రధాన నటుడిగా సూరి నటించిన ‘గరుడన్’ రెండవ చిత్రం. విడుతలై చిత్రానికి దర్శకత్వం వహించిన వెట్రిమారన్ గరుడన్ చిత్రానికి కథను అందించారు.

Read Also: Mrunal Thakur: బాలీవుడ్‌లో జాక్‌పాట్ కొట్టిన సీత

ఈ చిత్రానికి ఆర్‌ఎస్ దురై సెంథిల్ కుమార్‌ దర్శకత్వం వహించారు. ఆర్ఎస్ దురై గతంలో ధనుష్‌తో పట్టాస్, కోడి చిత్రాలకు దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. హిట్‌ టాక్‌ను సొంతం చేసుకున్న ‘గరుడన్‌’ చిత్రం ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్‌ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా.. ఈ రోజు నుంచి తమిళ్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. అలాగే తెలుగులో అతి త్వరలోనే వచ్చే అవకాశం ఉన్నట్లుగా వినిపిస్తోంది. థియేట్రికల్, ఓటీటీ విడుదల మధ్య నాలుగు వారాల గ్యాప్ ఉంది.

ఈ సినిమాలో ఎం. శశికుమార్, ఉన్ని ముకుందన్, రోషిణి హరిప్రియన్, సముద్రఖని, మైమ్ గోపి, శివద ముఖ్య పాత్రలు పోషించారు. అలాగే యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా.. లార్క్ స్టూడియో, గ్రాస్ రూట్ ఫిల్మ్ స్టూడియో వారు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం థియేటర్లలో అభిమానుల మన్ననలు పొందగా.. డిజిటల్ స్పేస్‌లో ఇది ఎలా ఉంటుందో చూద్దాం.

Show comments