NTV Telugu Site icon

Garlic Leaves: వెల్లుల్లి తింటే ఉండదు అనారోగ్యపు లొల్లి

Garlic

Garlic

Garlic Leaves Benefits: మనం వంటలో ఉపయోగించే మసాలా దినుసులలో వెల్లుల్లి ఒకటి. ఔషధ గుణాలతో నిండిన వెల్లుల్లిలో లెక్కలేనన్ని ప్రయోజనాలున్నాయి. వెల్లుల్లిలాగే దీని ఆకులు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వెల్లుల్లి ఆకుల గురించి చాలామందికి తక్కువ తెలుసు, కానీ ఇవి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వెల్లుల్లి ఆకులను వసంత వెల్లుల్లి అని కూడా పిలుస్తారు. వెల్లుల్లి ఆకులను సూప్‌లు, చీజ్ డిప్‌లు, స్టైర్ ఫ్రైస్, సలాడ్‌లు మరియు మాంసం రోస్ట్‌ల వరకు ప్రతిదానిలో ఉపయోగించవచ్చు. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్న వెల్లుల్లి ఆకులు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి. గుండె పనితీరును పెంచుతాయి. శ్వాసకోశ సమస్యలు, జీర్ణక్రియ, అలసటల మొదలైన వాటి చికిత్సలో వెల్లుల్లి, దాని ఆకులను ఉపయోగించాలని చాలా మంది సిఫార్సు చేస్తుంటారు. వెల్లుల్లి ఆకులను తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది. వెల్లుల్లి ఆకులను తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

వెల్లుల్లి ఆకులు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి:
వెల్లుల్లి ఆకులు లేదా పచ్చి వెల్లుల్లిని తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. విటమిన్ సి సమృద్ధిగా ఉండే ఈ ఆకులు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇవి శరీరానికి కావాల్సిన ఐరన్ ఇవ్వడంతో తోడ్పడుతాయి. దీని ఆకులను తీసుకోవడం వల్ల శరీరంలో ఎర్ర రక్తకణాలు కూడా పెరుగుతాయి.

Read Also: Kashmir Files : ఆస్కార్‎కి అర్హత పొందిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’

కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి :
వెల్లుల్లి ఆకులను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉండే వెల్లుల్లి ఆకులు చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి. కడుపులో మంటను తగ్గిస్తాయి. వెల్లుల్లి ఆకులను రోజూ వాడితే గుండె జబ్బులు సులభంగా దూరమవుతాయి.

జలుబు, దగ్గు, ఫ్లూ చికిత్స:
చలికాలంలో దగ్గు, జలుబు, ఫ్లూ సమస్యలు పెరుగుతాయి. ఈ సీజనల్ వ్యాధులను నివారించడంలో వెల్లుల్లి ఆకులు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇందులో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు జలుబు, దగ్గు, ఫ్లూ నుండి ఉపశమనం కలిగిస్తాయి.

Read Also:RRR Movie: రాసిపెట్టుకోండి ట్రిపుల్‎ఆర్‎కు ఆస్కార్ రాకపోతే.. నాది ఇచ్చేస్తా: హాలీవుడ్‌ నిర్మాత జాసన్‌ బ్లమ్‌

రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి:
వెల్లుల్లి ఆకులను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరానికి వచ్చే వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల ఆక్సీకరణ ఒత్తిడి వల్ల కణాలను పునరుత్పత్తి చేయడంలో సహాయపడుతుంది.

క్యాన్సర్ వంటి వ్యాధులను నయం చేస్తాయి:
వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్.. క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సలో సహాయపడుతుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్, మల క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్ నివారణలో కూడా వెల్లుల్లి ఆకులను కొంతమంది ఉపయోగిస్తున్నారు.