Site icon NTV Telugu

ప్రధాని మోడీ చేస్తున్నది రాజకీయం కాదు..గొప్ప తపస్సు : గరికపాటి

ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్నది రాజకీయం కాదు తపస్సు.. అందుకే ప్రపంచ దేశాలని మోడీ వైపు చూస్తున్నాయని ప్రశంసలు కురిపించారు గరికపాటి నరసింహారావు. హైదరాబాద్ లోని విద్యానగర్ శంకర్ మఠం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గరికపాటి మాట్లాడుతూ.. రాజకీయాన్ని ఒక తపస్సుగా భావించింది భారత జాతి అని.. రాజకీయ తపస్సు ఎట్లా ఉంటుందో ఈనాడు ప్రధాని మోడీ లో చూశామని తెలిపారు.

పరిపాలన మరీ సున్నితంగా..మరీ కఠినంగా ఉండకూడదని వెల్లడించారు. రాజకీయం బాగుండాలంటే మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు బయటకు రాకూడదన్నారు. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు రహస్యంగా ఉండబట్టే కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు చేయబడిందని తెలిపారు. రాజ్యాంగాన్ని అతిక్రమించి మాట్లాడవద్దని… పరిపాలన రాజ్యాంగం, శాస్త్ర ప్రకారం జరగాలని స్పష్టం చేశారు గరికపాటి నరసింహారావు.

Exit mobile version