Site icon NTV Telugu

Garikipati Narasimha Rao: యూట్యూబర్ అన్వేష్‌పై గరికపాటి నరసింహారావు ఫైర్.. వారికి నమస్కారం!

Garikapati

Garikapati

Garikipati Narasimha Rao: యూట్యూబర్ అన్వేష్ ఇటీవల ప్రముఖ ప్రవచన కర్త, మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావుపై నీచంగా మాట్లాడిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా మొత్తం ఒక్కసారిగా అన్వేష్‌పై విరుచుకుపడింది. ఫాలోవర్స్ సైతం భారీగా తగ్గారు. దీంతో అన్వేష్ ఇటీవల క్షమాపణలు సైతం చెప్పాడు. అయితే.. తాజాగా గరికపాటి నరసింహారావుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యూట్యూబర్ అన్వేష్ వ్యాఖ్యలపై గరికపాటి పరోక్షంగా స్పందించారు. నేరస్థుడికి శిక్ష కంటే సమాజం ఛీత్కరించుకున్నప్పుడే మార్పు వస్తుందని వెల్లడించారు.

READ MORE: AP Telangana Water Dispute :తెలుగు రాష్ట్రాల మధ్య నదీజలాల వివాదాల పరిష్కారానికి కమిటీ

“ఒక నేరస్థుడికి శిక్ష పడితే మారతాడో లేదో తెలియదు కానీ.. పది మంది ఈ సడించుకుంటే పది రోజుల్లో మారతాడు. ఆ ఈసడించుకునే ప్రవృత్తి కూడా రావాలి. నువ్వు చేసింది ఏంటి? మోఖం మీద ఉమ్మేస్తాం అని అనగలగాలి. లేకపోతే ఏ మచ్చ లేని వాళ్ల మీద బురద జల్లుతున్నారు. వ్యక్తిత్వాలను ఖూనీ చేసే విధంగా చేస్తున్నారు. మనం సహిస్తూ ఉంటాం. మనకు ఎందుకులే అనుకుంటాం. సందర్భం వచ్చింది కాబట్టి నేను మొహమాటం లేకుండా చెబుతున్నా.. నా విషయంలో అభిమానులు మాత్రం ఎప్పుడూ సహించలేదు. పెట్టాల్సిన రేవు పెడుతూనే ఉన్నారు. హాయిగా, శుబ్బరంగా పెడుతున్నారు. మొత్తం శత్రుపక్షం వాళ్లు పారిపోయేలా పెడుతున్నారు. సోషల్ మీడియాలోనూ మనదే పైచేయి. ధర్మానికి నిలబడతారనే విషయం తెలిసింది. మీ అందరికీ సాదరంగా నమస్కారం చేస్తున్నాను. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తప్పకుండా స్పందించాలి.” అని గరికపాటి ఓ ప్రవచనంలో వెల్లడించారు.

READ MORE: BJP: భారత వ్యతిరేకులతో రాహుల్ గాంధీకి సంబంధాలు.. ఇవే ఆధారం అంటున్న బీజేపీ..

 

Exit mobile version