NTV Telugu Site icon

Saripodhaa Sanivaaram: “గరం.. గరం..” అంటూ రాబోతున్న నాని ‘సరిపోదా శనివారం’ ఫస్ట్‌ సింగిల్‌..

Nani

Nani

నాని హీరోగా వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’ . ‘నాని 31’ పేరుతో నిర్మితమయ్యే ఈ సినిమాపై ప్రేక్షకుల అందరి కోరికలను పరిగణలోకి తీసుకున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. క్యాలెండర్ పేజీలను తిప్పిట్టప్పుడు సూర్య మ్యాడ్‌నెస్ కౌంట్‌ డౌన్‌ ను చూపించే వీడియోను మేకర్స్ షేర్ చేసారు. రెండు రోజుల్లో మొదటి సింగిల్ “గరం గరం” విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. జూన్ 15న పాటను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు చిత్ర బృందం. ఈ వీడియో ప్రసతుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Gurugram: మహిళా పారిశుద్ధ్య కార్మికురాలి పై దూసుకెళ్లిన కారు.. అక్కడికక్కడే మృతి

నాని, వివేక్ ఆత్రేయ చేసిన కాంబో మూవీ ‘ అంటే సుందరానికి’ చిత్రం మిశ్రమ ఫలితాలను అందుకుంది. ఈ ప్రాజెక్ట్ తర్వాత నాని, వివేక్, ఆత్రేయ జోడీ మళ్లీ కనిపించనుండడంతో సినీ అభిమానుల్లో క్యూరియాసిటీ పెరుగుతుంది. హైదరాబాదులో నాని సంబంధించి వేసిన భారీ సెట్‌లో హై ఆక్టేన్ క్లైమాక్స్ సీక్వెన్స్ చిత్రీకరించబడిందని తెలిసిందే. ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తోంది.

Andhra Pradesh : జగన్ తో వైసీపీ పార్టీ నేతలు కీలక భేటీ(వీడియో)

డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ నటుడు ఎస్‌జె సూర్య ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ప్రత్యేకమైన యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రాబోతున్న ఈ చిత్రానికి సంగీతం, నేపథ్య సంగీతాన్ని జేక్స్ బిజోయ్ అందించారు. గ్యాంగ్ లీడర్ తర్వాత నాని, ప్రియాంక మోహన్ కలిసి నటిస్తున్న రెండో సినిమా ‘సరిపోదా శనివారం’.

Show comments