Site icon NTV Telugu

Ganta Srinivas Rao : నేడు గంటా శ్రీనివాసరావు నివాసంలో కీలక సమావేశం

Ganta Srinivas Rao

Ganta Srinivas Rao

గంటా శ్రీనివాసరావు నివాసంలో నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యనేతలతో రాజకీయ భవిష్యత్‌పై గంటా శ్రీనివాస రావు చర్చించనున్నారు. చీపురుపల్లి నుంచి మంత్రి బొత్సపై పోటీ చేయాలని గంటాకు హైకమాండ్‌ ఆదేశం పంపింది. అయితే.. నిన్న చంద్రబాబును కలిసిన గంటా శ్రీనివాస రావు విశాఖ జిల్లాలో సీటు ఇవ్వాలని కోరారు. పోటీ చేస్తే చీపురుపల్లి లేదంటే పార్టీ కోసం పనిచేయాలన్న హైకమాండ్‌ చెప్పడంతో… చీపురుపల్లి పోటీపై ఆసక్తి చూపట్లేదు. ఈ నేపథ్యంలోనే అనుచరులతో సమావేశం తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు గంటా.

Tatkaal Passport: ఎమర్జెన్సీ​గా విదేశాలకు వెళ్లాలా..? అయితే ‘తత్కాల్ పాస్ ​పోర్ట్’ ఎలా​ అప్లై చేయాలంటే..?!

‘ప్రతి ఎన్నికల్లో వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న మాట వాస్తవమే. కానీ, ఈసారి గెలిచిన చోట నుంచే మళ్లీ పోటీ చేయాలనుకున్నా’ ఇది మారిన గంటా స్వరం. ఈ క్రమంలో పదే పదే చంద్రబాబును కలుస్తూ.. తాను చీపురుపల్లిలో పోటీకి సిద్ధంగా లేనని, కాదని బలవంతంగా పోటీకి దించితే ఫలితం మరోలా ఉండొచ్చని మొరపెట్టుకున్నారు. కానీ, చంద్రబాబు మాత్రం గంటాను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా బుధవారం కూడా ఆయన​ చంద్రబాబును కలిశారు. తన నిర్ణయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో.. గంటా శ్రీనివాస్‌ ఇవాళ తన రాజకీయ భవిష్యత్తుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తున్నాయి.

Southern Railway: వందే భారత్‌లో పాట పడిన యువతులు.. వీడియో షేర్ చేసిన దక్షిణ రైల్వే

Exit mobile version