Gannavaram Tragedy: ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహం.. గన్నవరంలో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి!
- గన్నవరం నియోజకవర్గంలో విషాద ఘటన
- ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహం
- గన్నవరంలో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా జరిగిన ప్రమాదంలో ఒక ఇంజనీరింగ్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఓ కానిస్టేబుల్ బైక్ వెంటపడి హ్యాండిల్ పట్టుకుని లాగడంతో.. విద్యార్థి ఎదురుగా వసున్న బొలెరో వ్యాన్‌ను బలంగా ఢీకొట్టాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి…
గన్నవరం మండలం కేసరపల్లికి చెందిన పలగాని ప్రణయ్ ‘కేఎల్ యూనివర్సిటీ’లో ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అతని తమ్ముడు కౌషిక్ విజయవాడలోని ఎంఎంఎం కాలేజీలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ప్రతిరోజూ కౌషిక్‌ను తండ్రి శివాజీ ట్యూషన్ కోసం అవుటపల్లి తీసుకెళ్లేవాడు. అయితే శనివారం తండ్రి అందుబాటులో లేకపోవడంతో.. ప్రణయ్ తన తమ్ముడు కౌషిక్‌ను బైక్‌పై అవుటపల్లి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో అన్నదమ్ములు వెళ్తున్న బైక్‌ను ఆపేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఒక కానిస్టేబుల్ బైక్ వెంటపడి హ్యాండిల్ పట్టుకుని లాగాడు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
Also Read: Shikhar Dhawan: ఎంఎస్ ధోనీ ఎంతో మంది క్రికెటర్ల కెరీర్‌లను తీర్చిదిద్దాడు.. కష్టకాలంలో అండగా ఉంటాడు!
కానిస్టేబుల్ హ్యాండిల్ పట్టుకోవడంతో ప్రణయ్ భయంతో బైక్‌ను వెనక్కి తిప్పే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న బొలెరో వ్యాన్‌ను బలంగా ఢీకొట్టాడు. ప్రమాదంలో ప్రణయ్‌కు తీవ్ర గాయాలు కాగా.. అతని తమ్ముడు కౌషిక్ కూడా గాయపడ్డాడు. ఇద్దరినీ వెంటనే సమీపంలోని పిన్నమనేని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రణయ్ మృతి చెందాడు. తమ్ముడు కౌషిక్‌కు చికిత్స కొనసాగుతోంది. కొడుకు మృతి చెందడం, మరో కొడుకు గాయపడటంతో శివాజీ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ప్రణయ్ మృతదేహాన్ని గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. బంధువులు, తోటి విద్యార్థులు అక్కడికి చేరుకుని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!