Site icon NTV Telugu

Gannavaram: గన్నవరంలో టీడీపీ జెండా ఎగరడం ఖాయం..!

Yarlagadda

Yarlagadda

Gannavaram: గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు.. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో.. ప్రచారం మరింత విస్తృతం చేసిన యార్లగడ్డ.. విజయవాడ రూరల్ ప్రసాదంపాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.. తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, గ్రామ సర్పంచ్ సర్నాల బాలాజీ ఆధ్వర్యంలో ప్రచారం హుషారుగా సాగింది.. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ.. 175 కి 175 అన్న వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి.. మేం రెడీ అనే స్థాయికి వచ్చాడు అని సెటైర్లు వేశారు. ఒక్క సంక్షేమంతో గట్టెకుదాం అనుకుంటుంది ఈ ప్రభుత్వం.. అన్ని శాఖలకు సంబంధించిన డబ్బులు సంక్షేమానికి మళ్లించారని విమర్శించారు.

Read Also: Bandi Snajay: చీటర్స్, లూటర్స్ లకు.. ఒక ఫైటర్ కి జరుగుతున్న ఎన్నికలు..

ఇక, ఈ ప్రభుత్వంలో ఉద్యోగస్తులు హ్యాపీగా లేరు వ్యాపారస్తులు హ్యాపీగా లేరు.. ఉపాధి అవకాశాలు లేవు, నిర్మాణరంగం కుదేలు అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు యార్లగడ్డ.. ప్రభుత్వమే మద్యం షాపులు తెరిచే పరిస్థితి వచ్చిందని ఫైర్‌ అయ్యారు. ప్రభుత్వం దానధర్మాలు చేసే పరిస్థితికి వచ్చింది.. అభివృద్ధి లేదు.. ప్రభుత్వం పరిశ్రమలు తీసుకురాలేక దివాలా తీస్తే పరిస్థితి వచ్చింది నేను భావిస్తున్నాను అన్నారు. చంద్రబాబు నాయుడు వస్తే తప్ప ఈ రాష్ట్రం ముందుకెళ్లే పరిస్థితి లేదు.. రాబోయే కాలంలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రావడం ఖాయం.. గన్నవరంలో తెలుగుదేశం జెండా ఎగరడం ఖాయం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు.

Exit mobile version