Yarlagadda Venkat Rao: రాష్ట్రంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి విజయాన్ని ఎవ్వరూ ఆపలేరన్నారు గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు. విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడులోని ఎం.కన్వెన్షన్‌లో మంగళవారం సాయంత్రం జరిగిన నియోజకవర్గ స్థాయి యాదవుల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ.. యాదవులు అధైర్యపదొద్దని బడుగు, బలహీనవర్గాల సంక్షేమం కోసం ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో యాదవుల అభ్యున్నతికి పెద్దపీట వేస్తుందని చెప్పారు. వ్యవసాయం, పశు పోషణ తదితర రంగాల్లోని యాదవులకు ఎన్డీయే ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యత కల్పించే విధంగా కృషి చేస్తానని చెప్పారు.
Read Also: Janasena: జనసేన అభ్యర్థులకు బీ-ఫారాలు అందించిన పవన్ కళ్యాణ్
యాదవులందరూ ఎన్డీయే కూటమికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా ఆశీర్వాదిస్తే గన్నవరం నియోజకవర్గాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలుపుతానని, యాదవులకు ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి తన గెలుపునకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా గాజు గ్లాసు గుర్తుపై ఓటేసి బాలశౌరిని ఎంపీగా గెలిపించాలని కోరారు.