Ganja Chocolates: నగరంలో గంజాయి గ్యాంగ్ రూటు మార్చింది. నిన్న మొన్నటి వరకు గంజాయి రూపంలో విక్రయిస్తే ఇప్పుడు చాక్లెట్ల రూపంలో విక్రయిస్తున్నారు. గతంలో హవారా బ్యాచ్, ఒక వర్గం లక్ష్యం. అయితే ఇప్పుడు స్కూల్, కాలేజీ విద్యార్థులే టార్గెట్. చాక్లెట్లు ఇచ్చి వ్యసనంగా మార్చి గంజాయి ముఠా సొమ్ము చేసుకుంటున్నారు. పోలీసులు ఎన్ని తనిఖీలు చేస్తున్నా గంజాయి ముఠా అదుపు తప్పుతోంది. తాజాగా నగరంలోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో భారీగా గంజాయి చాక్లెట్లు కలకలం రేపాయి. 92 గంజాయి చాక్లెట్లను రాజేంద్రనగర్ ఎస్ఓటీ బృందం సీజ్ చేశారు.
Read also: MLA Sidda Reddy: సీఎం జగన్ టూర్‌కు దూరంగా ఎమ్మెల్యే సిద్ధారెడ్డి.. కారణం అదేనా..?
చాక్లెట్లు విక్రయిస్తున్నట్లు పక్కా సమాచారం రావడంతో ఎస్ఓటీ టీం రంగంలోకి దిగింది. తోల్ కట్టా వద్ద ఓ షెడ్డు పై ఎస్ఓటీ టీమ్ దాడి చేసింది. అక్రమంగా గంజాయి చాక్లెట్స్ విక్రయిస్తున్న ఓ వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అదుపులో తీసుకున్న వ్యక్తి సౌరబ్ యాదవ్ గా గుర్తించారు. సౌరబ్ ఖాన్ తో పాటు ఇద్దరిని ఎస్ఓటీ అరెస్ట్ చేశారు. ఇద్దరిలో ఒకరు పాత నేరస్థుడు ముస్తబా అలీ ఖాన్ ను అదుపులో తీసుకున్నారు. ముగ్గురు నిందితులపై ఎన్టీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకుని కాప్స్ దర్యాప్తు చేస్తున్నారు.
Read also: Fight Leopard: చిరుతపులితో ఫైట్ చేసిన జర్నలిస్ట్.. వీడియో వైరల్
హైదరాబాద్ పాత బస్తీ ఉప్పుగూడలో భారీగా గంజాయి పట్టుకున్నారు అధికారులు. 5 లక్షల విలువ చేసే 14 కేజీల గంజాయిని శంషాబాద్ ఎస్ఓటీ బృందం సీజ్ చేశారు. గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు మహిళలను అదుపులో తీసుకున్నారు. మరొకరు పరారీ. వారి వద్ద నుండి గంజాయి, ఓ కారు, రెండు మోటర్ సైకిళ్ల తో పాటు 2 మొబైల్స్ సీజ్ చేశారు అధికారులు. గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్స్ లో ప్యాకింగ్ చేసి విద్యార్ధులకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. శరీష, పద్మ తో పాటు శ్రీనివాస్ చారీ లపై ఎన్టీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి చత్రినాక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పిల్లులను టార్గెట్ చేస్తూ గాంజాయి చాకెట్లు, గంజాయిని విక్రయిస్తూ చిన్నారి బతుకులను చిదిలం చేస్తున్నారు. ఇప్పటికైనా పిల్లలపై తండ్రి తండ్రులు నిఘా వేసి ఉండాలని సూచిస్తున్నారు.
Garlic : మార్కెట్లో నకిలీ వెల్లుల్లి.. అక్రమ రవాణాలో చైనా హాషీష్, నల్లమందుతో పోటీ
