Site icon NTV Telugu

Ganja Smuggling: ఏవోబీలో ‘పుష్ప’ను మించిన సీన్‌.. పోలీసులకు సెల్యూట్

Ganja Smuggling

Ganja Smuggling

Ganja Smuggling: ఫారెస్ట్‌ అధికారుల కళ్లుగప్పి ఎర్రచందనం ఎలా స్మగ్లింగ్‌ చేయాలో పుష్ప సినిమాలో చూపించారు.. అయితే, ఆ తర్వాత ఇలాంటి ఎన్నో ఘటనలు వెలుగు చూశాయి.. తాజాగా.. అల్లూరి సీతారామ రాజు జిల్లాలో పుష్పసినిమా తరహాలో గంజాయిని తరలించారు స్మగ్లర్లు.. ఆంధ్ర – ఒడిశా స‌రిహ‌ద్దుల్లో పోలీసులు క‌ళ్లు గ‌ప్పి త‌ప్పించుకోవాల‌ని చూశారు.. అయితే స్మగ్లర్లకు చుక్కలు చూపించారు పోలీసులు.. గంజాయిని త‌ర‌లిస్తున్న వ్యాన్‌ను వెంబడించారు.. చేజింగ్‌ చేసి పట్టుకున్నారు.

Read Also: ODI WC 2023: ఆసియా కప్ ఎఫెక్ట్.. పాకిస్తాన్ జట్టులో కీలక ఆటగాళ్లకు విశ్రాంతి..!

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆంద్రా-ఒడిశా స‌రిహ‌ద్దు్ల్లోని చిత్రకొండ పోలీసులు పెట్రోలింగ్ నిర్వహింస్తుండ‌గా ఒక బొలోరో వాహనం వేగంగా రావడాన్ని గమనించారు. ఆ వాహనాన్ని ఆప‌డానికి ప్రయత్నించారు పోలీసులు.. అయితే, తప్పించుకుని స్మగ్లర్లు పారిపోయారు. ఇక, గంజాయి వాహ‌నం ఛేజింగ్‌ను వీడియో చిత్రీకరించారు పోలీసులు. ఆ వీడియోలో వ్యాన్‌ను పోలీసులు వెంబడిస్తుండగా.. పోలీసుల నుంచి తప్పుంచుకోవడానికి వ్యాన్‌లో ఉన్న గంజాయి మూఠలను రోడ్డుకు అడ్డంగా వేస్తూ వెళ్లారు స్మగ్లర్లు.. ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా.. పోలీసులు వ్యాన్‌ను ఛేజ్‌ చేశారు. వ్యాన్‌ను, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు చిత్రకొండ పోలీసులు.. స్వాధీనం చేసుకున్న గంజాయి సుమారు 980 కేజీలు ఉండగా.. దీని విలువ సూమారు కోటి రూపాయల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఒడిశాలో కొనుగోలు చేసిన గంజాయిని ఏపీలోకి త‌ర‌లిస్తున్నట్లు పోలీసులు ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలగా.. ఈ గంజాయి ర‌వాణాలో పాత్రదారుల‌పై విచార‌ణ జ‌రుపుతున్నట్లు చిత్రకొండ పోలీసులు తెలిపారు.

Exit mobile version