Cannabis : పుష్ప సినిమాలో అల్లు అర్జున్.. ఏ టైంలో ట్యాంకర్లో ఎర్రచందనం దుంగలను రవాణా చేసేందుకు టెక్నిక్ ఉపయోగించాడో కానీ.. ప్రస్తుతం కేటుగాళ్లు అక్రమ రవాణాకు అదే టెక్నిక్ ఉపయోగిస్తున్నారు. అయినా పోలీసులు పట్టేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ ముఠా గంజాయి రవాణా చేసేందుకు పుష్ప సీన్ ను ఇన్సిపిరేషన్ గా తీసుకుంది. రూ.కోటి విలువైన గంజాయిని పోలీసుల కళ్లు గప్పి ట్రాక్టర్లో తరలించేందుకు ప్రయత్నించి పోలీసులకు చిక్కింది. వివరాల్లోకి వెళితే.. మల్కన్ గిరి, ఒరిస్సా రాష్ట్రానికి చెందిన రఘునాథ్, రవీంద్ర అనే ఇద్దరు ట్రాక్టర్లో 485 కిలోల గంజాయిని ఆంధ్రా- ఒరిస్సా సరిహద్దులలో గల మల్కన్ గిరి నుంచి కరీంనగర్కు భద్రాచలం మీదుగా అక్రమంగా తరలిస్తున్నారు.
Read Also:Cannes 2023: మెడ చుట్టూ ఉరితాడుతో ఇరాన్ మోడల్.. ఎందుకంటే..
వీరు గంజాయిను తరలిచేందుకు ట్రాక్టర్ ట్రాలీకి సీక్రెట్ ఛాంబర్ ఏర్పాటు చేశారు. అందులో 5 కిలోల బరువు గల 97 గంజాయి ప్యాకెట్ లను పెట్టారు. సోమవారం(మే 29) ఉదయం కూనవరం రోడ్ చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు తనిఖీలు చేశారు. ట్రాక్టర్ ట్రాలీపై భాగాన చూస్తే తక్కువ లోతు కనిపిస్తోంది. సైడ్కు చూస్తే కొలత పెద్దగా అనిపిస్తుంది. స్మగ్లర్ల కదలికలు అనుమానంగా అనిపించడంతో పోలీసులు ట్రాక్టర్ ను క్షుణ్నంగా పరిశీలించారు. దీంతో అసలు విషయం బయటపడింది. ట్రాక్టర్ ట్రాలీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీక్రెట్ ఛాంబర్లో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 97 గంజాయి ప్యాకెట్లను వారు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువు దాదాపు కోటి రూపాయలు ఉంటుందని తెలిపారు. ఇద్దరు స్మగ్లర్లపై కేసు నమోదు చేశారు.
Read Also:Tamilanadu: కంటతడి పెట్టిస్తున్న ఘటన.. బిడ్డ శవాన్ని 10 కిమీ మోసుకెళ్లిన తల్లి..
