NTV Telugu Site icon

Ganja Seized : పక్కప్లాన్‌తో దాడులు.. రెండు కేజీల గంజాయి.. నాలుగు బైకులు సీజ్‌

Ganja In Hydrabad

Ganja In Hydrabad

Ganja Seized : కార్వాన్‌ టోలీ మజీద్‌ ప్రాంతంలో ఒక ఇంట్లో గంజాయి అమ్మకాలు జరుపతున్నారనే సమాచారం మేరకు ఎక్సైజ్‌ పోలీస్‌లు, ఎస్టీఎప్‌ టీం సభ్యులు తనిఖీలు నిర్వహించారు. శుక్రవారం జరిపిన దాడుల్లో అలీంఖాన్‌ అనే వ్యక్తి ఇంట్లో నలుగురు యువకులు గంజాయి అమ్మకాలు జరుపుతుండగా పట్టుకున్నారు. నలుగురి వద్ద 2.1 కేజీల గంజాయిని లభించింది. వారు గంజాయిని అమ్మకాలకు తీసుక వెళ్లె నాలుగు బైకులను, ఆరు సెల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, బైకుల, సెల్‌ ఫోన్ల విలువ రూ. 3 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఈ కేసులోతోమ్మిది మంది నిందితులపై కేసు నమోdu చేశారు. నలుగురిని అరెస్టు చేశారు.

Mopidevi: కన్నులపండువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు ప్రారంభం

గంజాయి అమ్మకాలతో పట్టు బడిన నిందితుల్లో ఎండి సలీం ఖాన్‌, ఎండి ఇంతియాస్‌ ఖాన్‌, వంశీకృష్ణ, సోనులను అరెస్టు చేశారు. మిగిలిన ఐదుగురు అమర్‌, సల్మాన్‌, నరేందర్‌, తుజ్లా సింగ్‌, కృష్ణ కుమార్‌లు పరారీలో ఉన్నారని ఎక్సైజ్‌ సూపరిండెంట్‌,‌ ఎస్టిఎఫ్ టీం లీడర్‌ నంద్యాల అంజి రెడ్డి తెలిపారు. వీరితోపాటు 31 మంది వినియోగదారుల పేర్లను కూడ కేసులో చేర్చారు. గంజాయిని పట్టుకున్న టీమ్‌లో ధూల్‌పేట్‌ సీఐ మధాుబాబు, గోపాల్‌, ఎస్టీఎప్‌ ఎస్సైలు లలిత, భాస్కర్‌, హెడ్‌ కానిస్టేబుళ్లు భాస్కర్‌రెడ్డి, అజీమ్‌, శ్రీధర్‌, కానిస్టేబుళ్లు ప్రకాష్‌, వికాస్‌లు ఉన్నారు. గంజాయిని పట్టుకున్న టీమ్‌ను ఎక్సైజ్‌ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ వి.బి.కమలాసన్‌రెడ్డి అభినందించారు.

Stock Market: రుచించని ఆర్బీఐ పాలసీ.. నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

Show comments