ద్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజులపాటు వడగండ్లతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అయితే.. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలకు నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలోని రాంపూర్, నవీపేట్, పోతంగల్, మోకన్‌పల్లి, ఆభంగపట్నం, అబ్బాపూర్ గ్రామాల్లో కల్లాల్లోనే ధాన్యం తడిసిపోయింది. పలుచోట్ల ధాన్యం మొలకెత్తింది. పలుచోట్ల తూకం వేసిన ధాన్యం బస్తాలు సైతం తడిసిపోయాయి. బోధన్, సాలూర మండలాల్లో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది.
Also Read : MLA Seethakka : పేదల కష్టాలు తీరాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిందే
అయితే.. అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రైతులు తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలని.. 17 శాతం తేమ ఉంటేనే కొనుగోలు చేస్తామని చెప్పారు. ఎఫ్ సీఐ విధానాల ప్రకారమే వరి కొనుగోలు చేస్తామని.. 20 శాతం తేమ ఉన్నా తీసుకోవాలని కేంద్ర సంస్థను కోరినట్లు తెలిపారు. కేంద్ర ఫసల్ భీమా యోజనతో ఎలాంటి ఉపయోగం లేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వేగంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. అకాల వర్షాల నేపథ్యంలో రైతులెవరూ ఆందోళన చెందొద్దని, తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. జోరు వానల్లోనూ వేగంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు 5 వేల కేంద్రాలను ప్రారంభించి 40 వేల మంది రైతుల నుంచి 7.51 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు వివరించారు.
Also Read : GHMC : జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం.. గ్రేటర్‌లో సెలార్ల తవ్వకాలపై ఆంక్షలు
