Delhi: పెళ్లి చేసుకున్న గ్యాంగ్స్టర్లు.. అసలేం జరిగిందంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో భారీ బందోబస్తు మధ్య ఇద్దరు గ్యాంగ్స్టర్లు వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. హర్యానాకు చెందిన సందీప్, రాజస్థాన్‌కు చెందిన అనురాధా చౌదరి.. ఇద్దరూ గ్యాంగ్స్టర్లు.. వీరిపై అనేక కేసులున్నాయి. ప్రస్తుతం సందీప్ తీహాడ్ జైల్లో ఉండగా.. అనురాధా బెయిల్‌పై ఉంది. అయితే పెళ్లి కోసం సందీప్‌కు న్యాయస్థానం ఆరుగంటలు పెరోల్ ఇచ్చింది. దీంతో మంగళవారం ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలోని ఓ హాల్లో అనురాధా మెడలో మూడు ముళ్లు వేయడంతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.
ఓ గ్యాంగ్‌స్టర్ ఫ్రెండ్ ద్వారా సందీప్‌కు అనురాధా పరిచయం ఏర్పడింది. అలా నాలుగేళ్లుగా వారిద్దరూ ప్రేమలో ఉన్నారు. మార్చి 12న పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో సందీప్‌కు కోర్టు 6 గంటలు పెరోల్ ఇచ్చింది. పెళ్లి కోసం ద్వారకలోని ఓ ఫంక్షన్ హాల్‌ను బుక్ చేసుకున్నారు. సందీప్ తరపు న్యాయవాది రూ.51 వేలకు ఈ హాల్‌ను బుక్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. గ్యాంగ్స్టర్లు తప్పించుకునే ప్రమాదం ఉందన్న వార్తల నేపథ్యంలో డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలు, మెటల్ డిటెక్టర్ల ఏర్పాటుతో పాటు సాయుధ బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. ఈ వివాహానికి సందీప్ కుటుంబం 150 మంది అతిథులను ఆహ్వానించింది.
Also Read
- Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
- WTC 2025-27: ఆస్ట్రేలియా టాప్, భారత్ 5వ స్థానం.. మిగిలిన 9 మ్యాచ్‌లు డూ ఆర్ డై..
- Lokesh Kanagaraj DC Movie Review : లోకేష్ కనగరాజ్ 'డీసీ' రివ్యూ..
- Harish Rao: చేనేత కార్మికుల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి సెల్యూట్..
సందీప్‌పై దోపిడీ, హత్య, హత్యాయత్నం వంటి పదికి పైగా కేసులున్నాయి. ఒకప్పుడు సందీప్ తలపై రూ.7 లక్షల రివార్డుతో వాంటెడ్ క్రిమినల్ కేసులున్నాయి. ఇక గ్యాంగ్‌స్టర్ ఆనంద్‌పాల్ సింగ్ దగ్గర పనిచేసిన అనురాధా చౌదరీపై కూడా అనేక కేసులున్నాయి. ఈమెకు ‘రివాల్వర్ రాణి’ పేరు కూడా కలదు. మొత్తానికి ఇద్దరు గ్యాంగ్స్టర్లు పెళ్లితో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుందానే మ్యారేజ్ జరిగింది.
తాజావార్తలు
-
Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
-
Brand Value: రిటైర్ అయినా తగ్గని బ్రాండ్ విలువ.. రూ.1,189 కోట్లతో టాప్‌లో.. కోహ్లీ, ధోనీ కాదండోయ్!
-
WTC 2025-27: ఆస్ట్రేలియా టాప్, భారత్ 5వ స్థానం.. మిగిలిన 9 మ్యాచ్‌లు డూ ఆర్ డై..
-
Harish Rao: చేనేత కార్మికుల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి సెల్యూట్..
-
Meta: మెటాకు భారీ షాక్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు.. 567 మిలియన్ డాలర్స్ చెల్లించాలని ఆదేశం
ట్రెండింగ్
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!