NTV Telugu Site icon

Atiq Ahmed : ఆమె శాపం వల్లే గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ చంపబడ్డాడా..?

Pooja

Pooja

Atiq Ahmed : గ్యాంగ్‌స్టర్‌ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌ను శనివారం ప్రయాగ్‌రాజ్‌లో వైద్య చికిత్స కోసం తీసుకువెళుతుండగా దుండగులు కాల్చి చంపారు. అయితే ఈ ఘటనను 18 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనగా పేర్కొంటున్నారు. నవవధువు చేతికి గోరింటాకు కూడా పోకముందే తన భర్తను కడతేర్చిన దుర్మార్గులకు మహిళ శాపం పెట్టింది. పెళ్లయిన తొమ్మిదో రోజు తన కంటిమీద కునుకు లేకుండా చేసిన వాడి పాపం పండుతుందని ఆగ్రహించింది. ఈ మహిళ ఎవరు..ఎవరి శాపం అతిక్ కుటుంబం మొత్తాన్ని నాశనం చేసింది.

మూడు రోజుల్లో అతిక్ కుటుంబంలోని ముగ్గురిని మట్టిలో కలిపేసింది. తొలుత అతిక్ కుమారుడిని పోలీసులు ఎన్ కౌంటర్ లో కాల్చిచంపారు. రెండు రోజుల తర్వాత అతిక్, అతని సోదరుడు పోలీసుల ముందే కాల్చి చంపబడ్డారు. శనివారం అర్థరాత్రి జరిగిన మారణకాండకు 18 ఏళ్ల క్రితం జరిగిన ఘటనతో ముడిపడి ఉంది. ఒక మహిళ శాపం అతిక్, అతని అనుచరులు అదే విధిని ఎదుర్కొన్నారు.

Read Also: YS Viveka Case: నేడు సీబీఐ ముందుకు అవినాష్‌రెడ్డి.. విచారణపై ఉత్కంఠ

ఆ మహిళ పేరు పూజా పాల్, మాజీ ఎమ్మెల్యే రాజుపాల్ భార్య. ఈ ఘటన 2004లో జరిగింది. అతిక్ అహ్మద్ లోక్‌సభ ఎన్నికల్లో ప్రయాగ్‌రాజ్ నుంచి గెలుపొందారు. మరోవైపు ప్రయాగ్‌రాజ్ పశ్చిమ విధానసభ ఉప ఎన్నిక జరిగింది. 2005లో ఖాళీ అయిన స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో అతిక్ తన సోదరుడు అష్రఫ్‌ను రంగంలోకి దించాడు. బీఎస్పీ టికెట్‌పై రాజుపాల్‌ పోటీ చేశారు. అతిక్ కుటుంబం ఓటమి చవిచూడటం అదే తొలిసారి. ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంటనే రాజు పాల్‌కి పూజతో వివాహం జరిగింది. ఎమ్మెల్యే అయ్యి పెళ్లి చేసుకున్న రాజు రెట్టింపు ఆనందాన్ని అతిక్ కుటుంబం జీర్ణించుకోలేకపోయింది. రాజు పాల్‌ని చంపే పనిని అతిక్ సోదరుడు అష్రఫ్‌కి అప్పగిస్తాడు.

జనవరి 25, 2005న, ధూమన్‌గంజ్‌లో ఎమ్మెల్యే రాజుపాల్ చంపబడ్డారు. రాజు పాల్‌ని కిడ్నాప్ చేసి చంపినప్పుడు ప్రయాగ్‌రాజ్ మొత్తం దిగ్భ్రాంతికి లోనైంది. పెళ్లయిన తొమ్మిదో రోజే భర్త హత్యకు గురయ్యాడని పూజా పాల్ ఆవేదన చెందింది. ఏదో ఒకరోజు నువ్వు నా భర్తలా కుక్క చావు చస్తావని అతిక్ ను శపించింది. ఈ శాపం చివరికి తన కుటుంబాన్ని ఇలా నాశనం చేస్తుందని అతిక్ కలలో కూడా ఊహించలేదు. పద్దెనిమిదేళ్ల తర్వాత మూడు రోజుల్లో, అతిక్ కుటుంబానికి శాపం తగిలింది. ఇద్దరు మైనర్లు జైలులో ఉన్నారు. భార్య షాహిస్తా పరారీలో ఉంది. కొడుకు ఎన్‌కౌంటర్ రెండు రోజుల క్రితం జరగగా, అతిక్ మరియు అతని సోదరకుడు కాల్చి చంపబడ్డారు.

Show comments