Site icon NTV Telugu

Gangs of Godavari: ట్రైలర్‌ లాంఛ్ అడ్డా ఫిక్స్ చేసిన విశ్వక్‌సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’..

Gangs Of Godavari

Gangs Of Godavari

హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మాస్ యాక్షన్ చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. ఛల్ మోహన్ రంగ ఫేమ్ కృష్ణ చైతన్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈసారి ఎలాంటి వాయిదా వేయకుండా.. మే 31న పక్కాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయం సంబంధించి విశ్వక్ సేన్ ఇటీవల విడుదల చేసిన వీడియో ఇంటర్నెట్‌లో హల్చల్ చేస్తోంది. సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న కొద్దీ, ట్రైలర్ లాంచ్‌ పై మేకర్స్ అప్డేట్‌ను పంచుకున్నారు. గోదావరి గ్యాంగ్ ట్రైలర్‌ ను మే 25న సాయంత్రం 4:06 గంటలకు హైదరాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్స్‌ లోని దేవి థియేటర్‌ లో విడుదల చేయనున్నట్లు సినిమా టీం ప్రకటించారు. మాస్ క దాస్ విశ్వక్ సేన్, హీరోయిన్ల కొత్త లుక్ పోస్టర్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

RBI Dividend: 2.11 లక్షల కోట్ల డివిడెండ్ కు ఆర్బీఐ ఆమోదం..

ఈ చిత్రంలో నేహాశెట్టి, అంజలి లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే క్రియేటర్స్ విడుదల చేసిన “సుత్తంలా సూసి పోకలా” పాట మిలియన్ల కొద్దీ వ్యూస్‌ ని పొందుతోంది. హీరో కత్తి పట్టుకుని శత్రువులను చీల్చి చెండాడుతున్న పోస్టర్, అలాగే హీరోహీరోయిన్ల లిప్‌లాక్‌ పోస్టర్‌ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ఈ చిత్రంలో విశ్వక్‌ సేన్ ఊరమాస్ అవతార్‌ లో ‘లంకల రత్న’గా కనిపించనున్నాడు. సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్‌ బ్యానర్‌పై శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సినిమా రాబోతుంది.

Exit mobile version