Site icon NTV Telugu

Gangavva Panchangam: సినీ స్టార్స్‌, రాజకీయ ప్రముఖుల పంచాంగం.. గంగవ్వ నోట..

Gangavva Panchangam

Gangavva Panchangam

Gangavva Panchangam: తెలుగు లోగిళ్లలో తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు.. గుమ్మానికి మామిడాకుల తోరణాలు! వంటింట్లో పులిహోర భక్ష్యాలు! షడ్రుచుల కలబోతగా పచ్చడి ఆరగింపులే కాదు.. మన పండుగలకు ఆది పండుగైన ఉగాది రోజు.. పంచాంగ శ్రవణాలకు ప్రముఖ స్థానం ఉంది.. ఏ రాశివారికి ఎలా ఉండబోతోంది.. ఆదాయ వ్యయాలు, అవమాన, రాజ్యపూజ్యాల బేరీజులు.. ఇలా ఏడాది పాటు ఉలా ఉండబోతోంది అనేది పంచాగ శ్రవణంలో చెబుతున్నారు.. ఇక, మన సినిమా స్టార్స్ పంచాంగం ఎలా ఉండబోతోంది..? మన ప్రధాని, మన సీఎంకు మంచే జరగబోతోందా? అనే కుతూహలకం కూడా ఉంటుంది..

అయితే, ఉగాది పురస్కరించుకుని.. వనిత టీవీ ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది.. కమెడియన్‌ గా, గ్రామీణ యాశలో అందరికీ పరిచయం అయిన గంగవ్వ.. సినీ, రాజకీయ ప్రముఖుల పంచాగాన్ని చెప్పింది.. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌.. ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. ఇక, మెగాస్టార్‌ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ, హీరో ప్రభాస్‌, దర్శకుడు రాజమౌళి.. ఇలా అందరి భవిష్యత్‌ను తనదైన శైలిలో చెప్పుకొచ్చింది.. మన సినీ, రాజకీయ ప్రముఖుల గురించి గంగవ్వ చెప్పిన పంచాంగం కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..

https://www.youtube.com/watch?v=4VjPhx_RWPw

Exit mobile version