Memantha Siddham Bus Yatra: సీఎం వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన టీడీపీ ముఖ్యనేత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gangadhara Nellore TDP Leader A Harikrishna Joins in YCP: చిత్తూరులో ఏడోరోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కొనసాగుతోంది. ఈరోజు అమ్మగారిపల్లి నుంచి సీఎం వైఎస్ జగన్ బయల్దేరారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. బస్సు యాత్రలో కుప్పం నియోజకవర్గం టీడీపీ నుంచి కీలక నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అమ్మగారిపల్లె స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ సమక్షంలో కుప్పం నియోజకవర్గానికి చెందిన ఉమ్మడి చిత్తూరు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ఎం సుబ్రమణ్యం నాయుడు, కృష్ణమూర్తి, బేతప్పలు వైసీపీలో చేరారు.
Also Read: AP Pension: సచివాలయాలకు క్యూ కట్టిన పెన్షన్ దారులు.. మండుటెండలో వృద్ధుల ఎదురుచూపు!
Also Read
గంగాధర నెల్లూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నుంచి ముఖ్యనేత సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. టీడీపీ సీనియర్ నేత, 2019లో టీడీపీ తరఫున గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఎ. హరికృష్ణ.. అమ్మగారిపల్లె స్టే పాయింట్ వద్ద సీఎం సమక్షంలో వైసీపీలో చేరారు. మాజీ మంత్రి కుతూహలమ్మ కుమారుడు ఎ. హరికృష్ణ అన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి కె నారాయణస్వామి పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్రకు పెద్ద ఎత్తున ప్రజలు స్వాగతం పలుకుతున్నారు.
తాజావార్తలు
-
RK Roja: మంత్రి లోకేష్‌పై రోజా సంచలన ఆరోపణలు..
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
CM Revanth: భవనాలు నిర్మించడం సులభమే.. కానీ, కలలకు పునాదులు వేయాలంటే సంకల్పం ఉండాలి..!
-
Tamil Nadu: “తమిళం నేర్పలేనిది క్రైస్తవ మతం నేర్పింది”.. విజయ్ మంత్రి వ్యాఖ్యల కలకలం..
-
KTR: ‘8+8 = 0’.. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలపై సెటైర్లు..!
ట్రెండింగ్
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!