NTV Telugu Site icon

Memantha Siddham Bus Yatra: సీఎం వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన టీడీపీ ముఖ్యనేత!

Pawan Kalyan (2)

Pawan Kalyan (2)

Gangadhara Nellore TDP Leader A Harikrishna Joins in YCP: చిత్తూరులో ఏడోరోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కొనసాగుతోంది. ఈరోజు అమ్మగారిపల్లి నుంచి సీఎం వైఎస్ జగన్ బయల్దేరారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. బస్సు యాత్రలో కుప్పం నియోజకవర్గం టీడీపీ నుంచి కీలక నేతలు సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు. అమ్మగారిపల్లె స్టే పాయింట్‌ వద్ద సీఎం జగన్‌ సమక్షంలో కుప్పం నియోజకవర్గానికి చెందిన ఉమ్మడి చిత్తూరు మాజీ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎం సుబ్రమణ్యం నాయుడు, కృష్ణమూర్తి, బేతప్పలు వైసీపీలో చేరారు.

Also Read: AP Pension: సచివాలయాలకు క్యూ కట్టిన పెన్షన్ దారులు.. మండుటెండలో వృద్ధుల ఎదురుచూపు!

గంగాధర నెల్లూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నుంచి ముఖ్యనేత సీఎం వైఎస్ జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు. టీడీపీ సీనియర్‌ నేత, 2019లో టీడీపీ తరఫున గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఎ. హరికృష్ణ.. అమ్మగారిపల్లె స్టే పాయింట్‌ వద్ద సీఎం సమక్షంలో వైసీపీలో చేరారు. మాజీ మంత్రి కుతూహలమ్మ కుమారుడు ఎ. హరికృష్ణ అన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి కె నారాయణస్వామి పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్రకు పెద్ద ఎత్తున ప్రజలు స్వాగతం పలుకుతున్నారు.

Show comments