Site icon NTV Telugu

Fake Medicines: బట్టతల రాకుండా జుట్టు పెరిగేందుకు నకిలీ మందుల కలకలం.. ముఠా అరెస్ట్

Medical Mafia

Medical Mafia

Fake Medicines: జుట్టు పెరిగేందుకు అవసరమైన మందులని ప్రచారం చేస్తూ.. తక్కువ కాలంలో జుట్టు పెరుగుతుందని మోసాలు చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదకరమైన రసాయనాలతో క్రీములు తయారుచేసి విక్రయిస్తున్న ముఠా ఆటకట్టించారు హైదరాబాద్‌ పోలీసులు. జుట్టు పెరిగేందుకు అవసరమైన మందులంటూ మెడికల్‌ మాఫియా ప్రచారం చేసింది.

Read Also: Tragedy: అమెరికా వెళ్లేందుకు అంతా రెడీ.. ఇంతలోనే అనంతలోకాలకు..

ఈ తరుణంలో హైదరాబాద్ నగరంలో పలు మెడికల్ షాపులో డ్రగ్ కంట్రోల్ సోదాలు నిర్వహించింది. బట్టతల రాకుండా జుట్టు పెరిగేందుకు మందులని ప్రచారం చేసింది మెడికల్ మాఫియా. పలు రకాల నకిలీ క్రీములను డ్రగ్ కంట్రోల్ అధికారులు సీజ్ చేశారు. ప్రమాదకరమైన రసాయనాలతో తయారు చేసిన క్రీమ్‌లు వాడడంతో ఉన్న జుట్టు ఊడిపోతుందని డ్రగ్ కంట్రోల్ బ్యూరో తెలిపింది. తప్పుడు ప్రచారాలతో నకిలీ క్రీమ్‌ను విక్రయిస్తున్న ముఠాను డ్రగ్‌ కంట్రోల్ బ్యూరో పట్టుకుంది. ఐదుగురు సభ్యుల గల ముఠా అదుపులోకి తీసుకుంది డ్రగ్ కంట్రోల్ బ్యూరో.

Exit mobile version