గోబెల్స్‌కు వారసులు బీజేపీ, కాంగ్రెస్ నేతలు అని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ పీఏ సొంత ఊర్లో గ్రూప్ 1 పరీక్ష రాసింది పది మంది అని, అందులో క్వాలిఫై అయ్యింది ఒక్కరే అన్నారు. ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చినా తప్పే.. ఇవ్వకపోయినా తప్పే అవుతుందని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మైలర్ అని సొంత పార్టీ వాళ్లే చెబుతున్నారని, ఓటుకు నోటు దొంగ.. చిలకపలుకులు పలుకుతున్నారంటూ ఆయన విమర్శలు గుప్పించారు. రాజస్థాన్ లో పేపర్లు లీక్ అయ్యాయని, అక్కడి ముఖ్యమంత్రి, మంత్రులు రాజీనామా చేశారా? అని ఆయన ప్రశ్నించారు.
Also Read : Danashree Verma : హద్దులు చెరిపేసిన ధనశ్రీ వర్మ.. ఎద అందాలతో రచ్చ రచ్చ
కాంగ్రెస్, బీజేపీ బట్టకాల్చి మీదేస్తున్నారని, సిరిసిల్లలో నవీన్ తల్లిదండ్రులతో ప్రతిపక్షాలు రాజకీయాలు చేయొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. కవితను కుట్ర పూరితంగా బీజేపీ ఇబ్బందులు పెడుతున్నారని, ఈడీ విచారణ పేరుతో కవితను ఢిల్లీకి పిలిచారని, కేసీఆర్ ను భయపెట్టాలని బీజేపీ చేస్తోందన్నారు. కవితను అడ్డుపెట్టి కేసీఆర్ స్పీడ్ ను ఆపాలని చూస్తున్నారని, కడిగిన ముత్యంలా కవిత బయటకు వస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Also Read : Historical Forts: భారతదేశంలో ప్రసిద్ధి చెందిన 10 చారిత్రక కోటలు