ప్రపంచ వ్యాప్తంగా గేమ్ ఆఫ్ థ్రోన్స్ వెబ్ సీరిస్ ఎంతగానో ఫేమస్ అయింది.. అంతగా ఫేమస్ అయ్యిన ఈ సీరిస్ ఇంగ్లీష్ లో ఉండటం వలన చాలా మంది తెలుగు ప్రేక్షకులు చూడలేకపోయారు.గేమ్ ఆఫ్ థ్రోన్స్ తెలుగులో ఎప్పుడు డబ్ అవుతుందని తెగ ఎదురుచూస్తున్నారు.. అదిరిపోయే గ్రాఫిక్స్ తో తెరకెక్కిన ఈ సిరీస్‌కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గేమ్ ఆఫ్ థ్రోన్స్ ప్రీక్వెల్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ ఈ మధ్యనే విడుదల అయి మంచి విజయం సాధించింది.. గేమ్ ఆఫ్ థ్రోన్స్‌ను తెలుగులో వీక్షించాలనే ఫ్యాన్స్‌కు సంతోషం కలిగించే వార్త ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. అదేమిటంటే ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్ వెబ్ సిరీస్ తెలుగు లో ఓటీటీ లో స్ట్రీమ్ కాబోతోంతుందని సమాచారం.ఇండియాలో ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’ ఓటీటీ సంస్థ పలు హాలీవుడ్ సినిమాలను, సిరీస్‌లను స్ట్రీమింగ్ చేస్తున్న సంగతి తెల్సిందే. వాటిలో ఎక్కువగా హెచ్.బి.ఓ కంటెంట్ ఉంటుంది.
ఎన్నో సంవత్సరాలుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్, హెచ్.బి.ఓ మధ్య ఉన్న ఒప్పందం కొనసాగుతూ వస్తోంది. ఆ ఒప్పందం కారణంగా హెచ్.బి.ఓ నెట్ వర్క్ కంటెంట్ ను ఇప్పటివరకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ స్ట్రీమింగ్ చేస్తూ వచ్చింది. ప్రతి సంవత్సరం కూడా ఒప్పందంను రెన్యూవల్ చేసుకుంటూ కంటెంట్‌ను కొనసాగిస్తు వస్తుంది.కానీ ఈసారి ఆ ఒప్పందం రెన్యూవల్ కాలేదని సమాచారం.దీంతో మార్చి 31 తర్వాత డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఉండే హెచ్.బి.ఓ కంటెంట్ ను పూర్తిగా తొలగించారని తెలుస్తుంది.. ఆ స్ట్రీమింగ్ రైట్స్ ని జియో సినిమా దక్కించుకున్నట్లు సమాచారం.. తాజాగా జియో గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటంటే జియో సినిమాలో ఈ వెబ్ సిరీస్ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ స్ట్రీమ్ కానుందని తెలిపినట్లు సమాచారం.. అతి త్వరలోనే ఈ భాషల్లో గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్ట్రీమ్ సిరీస్ జియో సినిమాలో స్ట్రీమ్ కాబోతుంది.ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది