NTV Telugu Site icon

Game Changer Update: ‘గేమ్ ఛేంజర్’ టీజర్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?

Game Changer Teaser

Game Changer Teaser

తమ అభిమాన హీరో సినిమా నుంచి ఏ చిన్న అప్‌డేట్‌ వచ్చినా.. ఫ్యాన్స్‌ తెగ సంబరపడతారు. అందులోనూ ‘మెగా’ మూవీ నుంచి వస్తే.. ఇక వారికి పండగే అని చెప్పాలి. దీపావళి రోజు మెగా అభిమానులకు ఓ శుభవార్త. గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్‌ నటిస్తున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ నుంచి ఓ అప్‌డేట్‌ వచ్చింది. గేమ్ ఛేంజర్ టీజర్‌ను నవంబర్ 9న రిలీజ్ చేస్తామని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ తెలిపింది. ఈ సందర్భంగా దీపావళి శుభాకాంక్షలు తెలిపింది.

టీజర్ రిలీజ్ డేట్ ప్రకటిస్తూ.. ఓ కొత్త పోస్టర్ కూడా చిత్ర నిర్మాణ సంస్థ పంచుకుంది. ఈ పోస్టర్‌లో రామ్‌ చరణ్‌ లుంగీ కట్టి మాస్ లుక్‌లో అదరగొట్టారు. విలన్‌ను చరణ్ చితకబాది పట్టాలపై వేసి కూర్చుకున్నట్లు అనిపిస్తోంది. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అయింది. మెగా ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రామ్‌ చరణ్‌ కథానాయకుడిగా ఎస్ శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పొలిటికల్‌ యాక్షన్ థ్రిల్లర్‌ గేమ్‌ ఛేంజర్‌. గత నాలుగేళ్లుగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ మూవీ ఎట్టకేలకు 2025 జనవరి 10న రిలీజ్ అవుతోంది.

Also Read: Yash: వైరల్ వీడియో.. ఇరగదీసిన యష్!

భారతీయుడు2, 3 చిత్రాలతో దర్శకుడు శంకర్‌ బిజీగా ఉండటంతో గేమ్‌ ఛేంజర్‌ ఆలస్యమవుతూ వచ్చింది. ఈ మూవీలో రామ్‌ చరణ్‌ షూటింగ్ పూర్తయింది. తమన్‌ సంగీతం అందిస్తున్న ‘ఈ సినిమాను దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో కియారా అడ్వాణీ కథానాయిక. అంజలి, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్‌, సునీల్‌, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. టీజర్‌ అప్‌డేట్‌ వచ్చింది కాబట్టి ఫ్యాన్స్ నవంబర్ 9 కోసం వెయిట్ చేస్తున్నారు.

Show comments