Game Changer Update: ‘గేమ్ ఛేంజర్’ టీజర్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?
- మెగా అభిమానులకు శుభవార్త
- గేమ్ ఛేంజర్ నుంచి అప్‌డేట్
- టీజర్ రిలీజ్ ఎప్పుడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమ అభిమాన హీరో సినిమా నుంచి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా.. ఫ్యాన్స్ తెగ సంబరపడతారు. అందులోనూ ‘మెగా’ మూవీ నుంచి వస్తే.. ఇక వారికి పండగే అని చెప్పాలి. దీపావళి రోజు మెగా అభిమానులకు ఓ శుభవార్త. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ నుంచి ఓ అప్‌డేట్ వచ్చింది. గేమ్ ఛేంజర్ టీజర్‌ను నవంబర్ 9న రిలీజ్ చేస్తామని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తెలిపింది. ఈ సందర్భంగా దీపావళి శుభాకాంక్షలు తెలిపింది.
టీజర్ రిలీజ్ డేట్ ప్రకటిస్తూ.. ఓ కొత్త పోస్టర్ కూడా చిత్ర నిర్మాణ సంస్థ పంచుకుంది. ఈ పోస్టర్‌లో రామ్ చరణ్ లుంగీ కట్టి మాస్ లుక్‌లో అదరగొట్టారు. విలన్‌ను చరణ్ చితకబాది పట్టాలపై వేసి కూర్చుకున్నట్లు అనిపిస్తోంది. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అయింది. మెగా ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ కథానాయకుడిగా ఎస్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్. గత నాలుగేళ్లుగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ మూవీ ఎట్టకేలకు 2025 జనవరి 10న రిలీజ్ అవుతోంది.
Also Read
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
Also Read: Yash: వైరల్ వీడియో.. ఇరగదీసిన యష్!
భారతీయుడు2, 3 చిత్రాలతో దర్శకుడు శంకర్ బిజీగా ఉండటంతో గేమ్ ఛేంజర్ ఆలస్యమవుతూ వచ్చింది. ఈ మూవీలో రామ్ చరణ్ షూటింగ్ పూర్తయింది. తమన్ సంగీతం అందిస్తున్న ‘ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో కియారా అడ్వాణీ కథానాయిక. అంజలి, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. టీజర్ అప్‌డేట్ వచ్చింది కాబట్టి ఫ్యాన్స్ నవంబర్ 9 కోసం వెయిట్ చేస్తున్నారు.
Happy Diwali Folks 😎💥
Celebrate #GameChangerTeaser from Nov 9th 🧨🔥#GameChanger In cinemas near you from 10.01.2025! pic.twitter.com/Y5pbNNftdu
— Game Changer (@GameChangerOffl) October 31, 2024
తాజావార్తలు
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!