తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు.ఆయన ప్రతి సినిమా కూడా విజువల్ వండర్ గా నిలుస్తుంది. ప్రతి సినిమాలో కూడా భారీ సెట్టింగ్ లు,సాంగ్స్ అలాగే ఫైట్స్ ప్రతిదీ కూడా ఎంతో క్వాలిటీ గా రిచ్ గా తీసి ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తారు….ఇక ఈ స్టార్ డైరెక్టర్ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక అలాగే విశ్వ నటుడు కమల్ హాసన్ తో ఇండియన్ 2 సినిమా ను కూడా చేస్తున్నాడు.అయితే దర్శకుడు శంకర్ కమల్ తో చేస్తున్న ఇండియన్ 2 సినిమా ను గేమ్ చేంజర్ సినిమా కంటే ముందుగానే స్టార్ట్ చేసాడు.కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ సినిమా ను మధ్యలోనే ఆపేశారు ఇక దాంతో శంకర్ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ సినిమా ను స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో ఇండియన్ 2 ప్రొడ్యూసర్స్ సినిమాను మళ్ళీ స్టార్ట్ చేయాలనీ కోర్ట్ కు వెళ్లారు. కోర్ట్ కూడా ఇండియన్ 2 సినిమాను స్టార్ట్ చేయాలనీ ఆదేశాలు ఇచ్చింది.. ఇక దాంతో చేసేది ఏమి లేక శంకర్ అటు గేమ్ చేంజర్ ఇటు ఇండియన్ రెండు సినిమాలు ఓకేసారి పూర్తి చేస్తున్నాడు…
అయితే ఎప్పుడో మొదలు పెట్టిన ఇండియన్ 2 సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. ఇక తర్వాత 2024 మార్చిలో గేమ్ ఛేంజర్ సినిమాను విడుదల చేయాలని ఒక ప్లాన్ కూడా సిద్ధం చేసుకున్నారు. కానీ అది ఇప్పుడు సాధ్య పడదని తెలుస్తుంది..రామ్ చరణ్ తో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా ముందుగా విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.ఎందుకంటే ఇండియన్ 2 సినిమాకు సంబంధించిన CG వర్క్ చాలా ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.అందుకే ఈ సినిమాను 2024 దీపావళికి రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.అలాగే వచ్చే ఏడాది సమ్మర్లో గేమ్ ఛేంజర్ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే గేమ్ చేంజర్ సినిమా మళ్ళీ మొదలైనట్లు తెలుస్తుంది. ఇటీవల దర్శకుడు శంకర్ బర్త్డే మూవీ టీం గ్రాండ్ గా నిర్వహించింది. అయితే ఈ సినిమాలో ఒక ఫైట్ సీన్ ఎంతో అద్బుతం గా ఉంటుందని సమాచారం.ఆ సీన్ కోసం మూవీ టీం కోసం ఎంతో కష్టపడ్డారని సమాచారం.ఆ సీన్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని సమాచారం..