Site icon NTV Telugu

Gam Gam Ganesha: మొదటిరోజు డీసెంట్ కలెక్షన్స్ రాబట్టిన గం గం గణేశా.. లెక్కలు ఇలా..

Gam Gam Ganesha

Gam Gam Ganesha

దాదాపు 400 సినిమా థియేటర్లో రిలీజ్ అయింది గం గం గణేశా మూవీ. సిక్స్ ప్యాక్ బాడీతో సినిమా హీరో ఆనంద్ దేవరకొండ కూడా తన వంతు ప్రయత్నంలో సినిమాను నడిపించాడు. ఈ సినిమా ద్వారా వంశి తారమంచి నిర్మాతగా పరిచయమయ్యారు. సినిమాలో ఈసారి కొత్తగా కనిపించిన హీరో ఆనంద్ తన యాక్టింగ్ తో మరోసారి అదరగొట్టాడు. చాలా ప్రదేశాల నుంచి మంచి టాక్ అందుకున్న ఈ సినిమా వసుళ్లపరంగా కూడా డీసెంట్ కలెక్షన్లను రాబట్టింది.

Samantha: బాలీవుడ్ హీరో సరసన సమంత..

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొదటి రోజు 1.82 కోట్ల క్రాస్ ను వసూలు చేసినట్లు చిత్ర బంధం తెలపంది. వారాంతంలో ఈ సినిమా మరింత మంచి వసూళ్లు సాధించేలా కనబడుతుంది. ఇప్పటికే ఈ సినిమా సంబంధించి ఓటిటి రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్లు సమాచారం.

Eye Cooling Techniques: వేసవిలో కళ్ళను రక్షించుకునేందుకు ఈ చిట్కాలు పాటించండి

ఇక ఈ సినిమాకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా రూ 5.5 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో అలాగే ఓవర్సీస్లో కలిపి నాలుగు నెలల కోట్ల రూపాయల బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ లెక్క ప్రకారం మూవీ బ్రేక్ ఈవెంట్ టార్గెట్ 6 కోట్లుగా ఉంది. దీంతో దాదాపు 12 కోట్ల రూపాయలు వసూలు చేయాలి. అయితే ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా బాగానే బిజినెస్ జరగడంతో హిట్ వైపు దూసుకు వెళ్తోంది. హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా పరిచయమైన ఆనంద్ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆనంద్ సినిమాలో పెద్దగా హిట్ సాధించలేకపోయినా.. నటన పరంగా మంచి పేరును తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా నడిపిస్తున్నాడు.

Exit mobile version