NTV Telugu Site icon

Gally Gang Stars: ఎట్టకేలకు థియేటర్స్‭లో సందడి చేయబోతున్న ‘గల్లీ గ్యాంగ్ స్టార్స్’..

Gally Gang Stars

Gally Gang Stars

Gally Gang Stars Releasing on July 26: సంజయ్ శ్రీ రాజ్, ప్రియ శ్రీనివాస్, భరత్ మహాన్, రితిక ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘గల్లీ గ్యాంగ్ స్టార్స్’. ఈ సినిమాను డా. ఆరవేటి యశోవర్ధాన్ ‘ABD ప్రొడక్షన్స్’ బ్యానర్ లో నిర్మించారు. ఇకపోతే సినిమా ఎటువంటి హంగామా లేకుండా సైలెంట్ గా ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక సినిమా విడుదల సందర్భంగా దర్శకుడు ధర్మ మాట్లాడుతూ.. “గల్లీ గ్యాంగ్ స్టార్స్ ” అనేది కేవలం సినిమా కాదు.. నిజ జీవితంలో ఎందరో అనాధలు ఎదురుకునే రోజువారి సంఘటనలు సంబంధించిన విషయం అంటూ.. అనాధల బాధ్యత సమాజం తీసుకోకపోతే ఆ సమాజం ఎన్ని దారుణాలను ఎదురుకోవాల్సి వస్తుందో వాస్తవికంగా తెరకెక్కించినట్లు తెలిపాడు.

Team India: ప్రపంచకప్ గెలవడంతో జెర్సీలో కీలక మార్పు..

సినిమా షూటింగ్ అంతా నెల్లూరులో నగరంలో 76 రోజుల పాటు షూటింగ్ చేశామని., ఎన్నో సార్లు అనుకున్న బడ్జెట్ దాటిపోయి షూటింగ్ ఆగిపోతుందనుకున్న ప్రతిసారి మా ప్రొడ్యూసర్ యశోవర్ధాన్ ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యటం వల్లే ఈ సినిమా ఈ రోజు రిలీజ్ కాబోతుందని.. చిన్నప్పటి నుంచి సినిమా అంటే ఎనలేని ఇష్టంతో యశోవర్ధాన్ సినిమా నిర్మాణం వైపు అడుగులు వేసి ABD ప్రొడక్షన్స్ అనే బ్యానర్ ని నిర్మించి.. టాలెంట్ ఉన్న యంగ్ డైరెక్టర్స్ కి అవకాశం ఇస్తూ వరసగా 3 సినిమాలు నిర్మించారు.

Average Student Nani : ‘ఏమైందో మనసే’ అంటున్న ‘యావరేజ్ స్టూడెంట్ నాని’గాడు

ఇందులో మొదటి సినిమా ప్రయోగాత్మకమైన చిత్రం “May 16”. ఈ సినిమా ఒక మోనో డ్రామా. ఆ తర్వాత చిత్రం నెల్లూరు గల్లిలో జరిగే మాస్ డ్రామా సినిమా “గల్లీ గ్యాంగ్ స్టార్స్”. ఈ సినిమా ఈ నెల 26న రిలీజ్ కానుంది. ఇదే బ్యానర్ లో వస్తున్న మరో సినిమా ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉందని., ఓ పక్క డాక్టర్ గా తన బాధ్యతలని.. ఇంకో పక్క తనకి ఎంతో ఇష్టమైన సినిమాలని రెండిటిని బాలన్స్ చేస్తున్నారని తెలిపాడు. ABD ప్రొడక్షన్స్‌తో మరెన్నో గొప్ప చిత్రాలకు తన సహకారం అందించాలని., సినీ చరిత్రలో తనకంటూ కొంత గుర్తింపు సంపాదించాలని ఆశిస్తున్నట్లు., చిన్న సినిమా ఐనప్పటికీ ఇందులో పాటలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని., తప్పక అందరిని అలరిస్తుందని నమ్ముతున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు ధియేటర్ కి వచ్చి మా చిన్న సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నానట్లు ఆయన అన్నారు.